టీవీ: కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న ప్రముఖ నటి.. మహా దారుణం అంటూ..?

Divya
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది ఇప్పటికే తెలియజేయడం జరిగింది... ఇక ఈ క్రమంలోనే చాలామంది తమ కెరీర్ ని ముందుకు సాగనంపడం కోసం ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా కొంత మంది ఎదుర్కొన్న వారు బహిరంగంగా తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా హిందీ సీరియల్ నటి దివ్యాంకా త్రిపాఠి కూడా ఈ విషయంపై కామెంట్స్ చేయడం జరిగింది. ఈమె" యె హై మొహాబ్బతే " అనే హిందీ సీరియల్ లో కూడా నటించింది..
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది ఎదుర్కొన్నానని తెలియజేసింది.. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అవకాశాలు వచ్చినప్పటికీ మన దగ్గర ఒకానొక సమయంలో డబ్బులు లేకపోవడంతో.. మన ఖర్చులు, EMI లు కట్టలేని పరిస్థితి వస్తుందని తెలియజేసింది. ఇక అలాంటి సమయంలోనే మనకి కొంతమంది దర్శకుల నుంచి ఆఫర్లు చాలా వస్తూ ఉంటాయి.. అయితే వారి సినిమాల ఎంపిక కావాలంటే వారితో కాస్త సమయాన్ని గడపాలని.. ఆ తర్వాత మనకు ఆఫర్ ఇస్తారని తెలియజేసింది దివ్యాంకా .
ఇలాంటి పని ఇండస్ట్రీలో కొంత మంది చేస్తున్నారు.. అలా వారు చేయడమే కాకుండా మరికొంత మందికి కూడా ఇలాంటి పని చేయమని చెబుతూ ఉంటారు అని తెలియజేసింది. ఇలా ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారని దివ్యాంకా తెలియజేసింది. ఇక కెరీర్ పరంగా మొదట్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఎంతో కష్టపడి తన మొదటి అవకాశాన్ని సంపాదించుకున్నానని..ఆ తరువాత ఎలాగోలాగా రెండో అవకాశం కూడా వచ్చిందని తెలియజేసింది..ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది దివ్యాంకా త్రిపాఠి. ఇక తను పడిన కష్టాలను చెబుతూ, చాలా బాధపడింది దివ్యాంకా త్రిపాఠి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: