ఇవాళ, రేపు గ్లోబల్ సమ్మిట్.. ప్రపంచం దృష్టిని రేవంత్ ఆకర్షిస్తారా?
ఈ సమ్మిట్‌కు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేషన్ రంగ నిపుణులు, పాలసీ నిర్ణేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సినిమా, క్రీడలు, విద్య, సాంకేతిక రంగాల్లో పేరొందిన వ్యక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విదేశీ రాయబారులు, పలు దేశాలకు చెందిన నిపుణులు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ కోసం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. అందులో రెండు వేల మందికంటే ఎక్కువ మంది అతిథులు హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ స్థాయి పాల్గొనే వారి రాకతో సమ్మిట్ ప్రాంగణం అంతర్జాతీయ వాతావరణాన్ని సంతరించుకుంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల రాకను దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రేవంత్ రెడ్డి ఈ రెండు రోజుల్లో ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు తిప్పగలరా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు