
జూనియర్ సమంత 'అషు రెడ్డి' గురించి ఈ విషయాలు తెలుసా?
జూనియర్ సమంత అంటూ అషు రెడ్డికి కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 3 లో చోటు సంపాదించుకుంది ఈ సుందరి. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఈమె చేసిన రచ్చ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరించి కుర్రకారును హోరెత్తించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ అషు రెడ్డి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఎంటి అంటే,
ఈ బొద్దుగుమ్మ పూర్తి పేరు ఆదికాలి అషూ రెడ్డి. అషు భారతీయురాలు కానీ అమెరికాలో టెక్సాస్ లో 1995, సెప్టెంబర్ 15 న జన్మించారు, అంటే ఈ మోడ్రన్ ముద్దుగుమ్మ వయసు ఇప్పటికీ 26 ఏళ్లు అన్నమాట. అషు పుట్టి పెరిగింది యుఎస్ లోనే ఆమె తన పాఠశాల విద్యాభ్యాసం అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదివారు. ఈమెకు దివ్య అనే సోదరి కూడా ఉంది. 'చల్ మోహన్ రంగ' సినిమాలో ఈమె మొదటిసారిగా నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఒక్క సారిగా ఈమెకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. జూబ్లీ హిల్స్ లోనీ ఎస్డిసి పార్క్ వద్ద ఈమెకు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈమె యు ట్యూబ్ ద్వారా నెలకు 70 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఇక టీవి షోస్ తో కూడా బాగానే వెనకేస్తోంది ఈ అందాల తార...