టీవీ: నెంబర్ వన్ కోడలు ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా..?

Divya
సాధారణంగా బుల్లితెరపై నటిస్తున్న ఎంతోమంది నటీనటులు మొదట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసి , ఆ తర్వాత బుల్లితెరపై తమ గుర్తింపును మరింత పదిలం చేసుకోవడానికి అడుగు పెడుతూ ఉంటారు.. ఎంతోమంది బుల్లితెర నటీనటులు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసి , అక్కడ పెద్దగా గుర్తింపు రాక తిరిగి బుల్లితెరపై తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా సినిమాల నుంచి సీరియల్స్ వైపు అడుగులు వేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో నెంబర్ వన్ కోడలు సీరియల్ వనజ కూడా ఒకరు..

జీ తెలుగులో మంచి టిఆర్పి రేటింగ్ తో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సీరియల్ నెంబర్ వన్ కోడలు.. ఈ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా టిఆర్పి రేటింగ్ తో కూడా దూసుకుపోతోంది.. ఇక నంబర్ వన్ కోడలు అనే సీరియల్ లో నటీనటులు తమ అందంతో,  నటనతో ఆకట్టుకున్నారు.. ఇందులో నటిస్తున్న వనజ అసలు పేరు శ్రీ రుతిక.. ఈమె కూడా మొదట్లో బుల్లితెరపై నటించి, ఆ తరువాత బుల్లితెరపై అవకాశాలను కొట్టేసి ప్రస్తుతం మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

1989 వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో జన్మించింది. ఈమెకు ఒక సోదరి కూడా ఉంది.. శ్రీకాకుళంలోని తన విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీ రుతిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కంది.. ఈ నేపథ్యంలోనే ఆమె షార్ట్ ఫిలింస్ లో నటించే అవకాశాన్ని కొట్టేసి అక్కడ మంచి అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇక అదే సమయంలో సినిమాలో ఛాన్స్ రావడంతో మొదటిసారి వేదం సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఇక తర్వాత అల్లుడు శ్రీను, రారండోయ్ వేడుక చూద్దాం, రహస్యం వంటి మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురు గా నటించిన ఈమె, తాజాగా ముగిసిన గోరింటాకు అనే సీరియల్లో కూడా హీరోయిన్ కి అక్క పాత్ర పోషించింది.. ఇక జెమినీ టీవీలో భాగ్యరేఖ సీరియల్ లో కూడా నటించింది.. ఇక ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ ను 2020లో పెళ్లి చేసుకుని సొంత యూట్యూబ్ ఛానల్ ను కూడా పెట్టి , తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: