టీవీ : యాంకర్ అనసూయను ఏకిపారేసిన కోటా.. కారణం..?

Divya
కోట శ్రీనివాసరావు సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద నటుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కొన్ని వందల సంఖ్యలో ఆయన సినిమాలు తీసి, ప్రస్తుతం ఖాళీగా ఇంట్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఎలా ఉండేవారు..? ఎవరు ఎలాంటి వాళ్ళు అనే విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే కోటా శ్రీనివాసన్ రావు మా ఎలక్షన్ లను ఉద్దేశించి కూడా పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు యాంకర్ అనసూయను కూడా కోటా ఏకిపారేస్తున్నారు. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

ప్రస్తుతం మా ఎలక్షన్లలో పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ ,  మంచు విష్ణు లలో కోట శ్రీనివాసరావు ..మంచు విష్ణు కు సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ కు నేను మద్దతు ఇవ్వడం లేదని చెప్పడం లేదు..  ప్రకాష్ రాజ్ ప్యానల్ లో కూడా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్లకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు..ఇక  ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎవరో అనసూయ  అంట..!  ఆమె పేరు కూడా నాకు తెలియదు.. ఈ మధ్యనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో అనసూయ అనే ఆవిడ పేరు తో పాటు మరో ముగ్గురు కొత్త వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి..

నిజానికి ప్రకాష్ రాజ్ ఏ ఒక్కరోజైనా షూటింగ్ కి సరైన సమయానికి వచ్చాడా..? 9 గంటలకు షూటింగ్ మొదలు పెట్టాలి అంటే ఆయన 11 గంటలకు వస్తాడు.. నీకోసం మేము గంటల తరబడి ఎదురు చూడాల్సి ఉండాలి.. ప్రకాష్ తో కూడా నేను ప్రధాన పాత్రల్లోనే కలిసి నటించాను.. ఈ ఒక్కరోజు కూడా షూటింగ్ సమయానికి రాడు.." మా " కోసం కూడా ఏ రోజు పని చేయలేదు.. కానీ ఆ పని చేశాను..ఈ పని చేశాను.. అంటూ ఏవేవో చెబుతున్నాడు.. ఇప్పటికైనా మీ ప్రగల్భాలు పలకడం మానుకోండి. ఈరోజు జరగబోయే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుంది.. అంటూ మా ఎన్నికల నుద్దేశించి అలాగే ప్రకాష్ రాజ్ ని కూడా ఉద్దేశించి కోట శ్రీనివాస రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: