బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారం నామిషన్ ప్రక్రియ పూర్తవగా 7 ఆర్ట్స్ సరయు మొదటి వారం ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇక తాజాగా బిగ్ బాస్ సోమవారం షోకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ముఖానికి రంగు వేసి నామినేట్ చేసేలా సెట్ చేశారు. ఇక హౌస్ మేట్స్ ఒకరికి మరొకరు రంగు రంగు వేసుకుంటూ నామినేట్ చేశారు. ఇక శ్వేత వర్మ ఎలిమినేషన్ ప్రక్రియలో రెచ్చిపోయింది. ముఖాలకు రంగు వేస్తూ రగిలిపోయింది. తాను మాట్లాడేటప్పుడు ఎవరూ మాట్లాడద్దంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చేసింది. ఇక యాంకర్ రవిని బయట తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్న లోబో నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. నీ దోస్తాన్ వద్దంటూ లోబో యాంకర్ రవిని నామినేట్ చేసాడు. అంతే కాకుండా లోబో మానస్ ను నామినేట్ చేసి ఆయన పై కూడా రెచ్చిపోయాడు.
హీరోలు యాటిట్యూడ్ చూపిస్తున్నారని చప్పట్లు కొడుతూ హాట్ కామెంట్స్ చేశాడు. గ్రూప్స్ గా చాలా మంది ఆడుతున్నారంటూ కాజల్ వ్యాఖ్యానించింది. ఇక ఇంట్లో ఉన్నప్పుడు అందరూ పనులు చేయాలని అప్పుడే నోట్లోకి ముద్ద వెలుతుందని విశ్వ వ్యాఖ్యానించాడు. ఇక యాని మాస్టర్ ను ఉద్దేశించి షణ్ముక్ జశ్వంత్ మాట్లాడుతూ...యానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. యానీ మాస్టర్ బయట కరెక్ట్ కానీ ఇంటికి ఫిట్ కాదని షణ్ముక్ అన్నాడు. ఇక నటి ఉమా అయితే దమ్ముంటే తనతో పెట్టుకోవాలని సవాల్ విసింరింది.
అంతే కాకుండా తనతో మాట్లాడాలంటే భయం ఉంటే గనుక అంటూ మాట్లాడగానే యానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చి భయం లేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక గత ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ ఉమా మధ్య గొడవపడగా ఇకపై ఎలాంటి గొడవలు ఉండవని అన్నారు. కానీ మళ్లీ ఇద్దరి మధ్య బాంబు పేలినట్టు కనిపిస్తోంది. పోవే ఉమా అంటూ ప్రియాంక సింగ్ అనటం ప్రోమోలో కనిపిస్తోంది. ఇక సింగర్ శ్రీరామ్ కు మరియు జెస్సీకి మధ్య కూడా చిచ్చు రేగినట్టు కనిపిస్తోంది. మొత్తానికి రంగు వేస్తూ నామినేషన్ చేసే విధానం పెట్టి హౌస్ మేట్స్ అసలు రంగు బయటపడేలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు.