బిగ్ బాస్ సీజన్ 5 నుండి మొదటి వారంలో 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. సరయు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన తరవాత నాగార్జున ముందు సంచలన వ్యాఖ్యాలు చేశారు. హౌస్ మేట్స్ పై సరయు చేసిన కామెంట్స్ తో నాగార్జున కూడా షాక్ అయ్యారు. ఇక బిగ్ బాస్ నుండి వచ్చిన తరవాత వెంటనే బిగ్ బాస్ బజ్ కు ప్రతి ఇంటి సభ్యుడు ఇంటర్య్వూ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సరయు కూడా బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ ఇంటర్వ్వూకు హోస్ట్ గా గత సీజన్ లో బిగ్ బాస్ బోల్డ్ పాపగా గుర్తింపు తెచ్చుకున్న అరియానా వ్యవహరిస్తుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో అరియానాతో సరయు ఏం చెప్పింది ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిందో ఇప్పుడు చూద్దాం. హౌస్ లో చాలామంది స్ట్రాటజీలతో వచ్చారని సరయు వ్యాఖ్యానించింది.
తనకు హార్డ్ వర్క్ మరియు యాక్టింగ్ మాత్రమే తెలుసునని సరయు చెప్పింది. గ్రూపులు గా ఆడేవాళ్లంతా దేవుడికే సమాధానం చెప్పాలని..అలాగే ఆ కంటెస్టెంట్ ల పేర్లను కూడా సరయు వెల్లడించింది. ఇక తాను ఎప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను టార్గెట్ చేసి ఆడానని..వీక్ గా ఉండేవాళ్లని టార్గెట్ చేసి ఆడలేదని సరయు స్టష్టం చేసింది. యాంకర్ రవికి భయట ఎంతో పాపులారిటీ ఉందని అందువల్లే యాంకర్ రవిని నామినేట్ చేశానని సరయు వెల్లడించింది. కాజల్ కు గేమ్ స్ట్రాటజీ తెలుసని అందువల్లే కాజల్ ను నామినేట్ చేసానని వెల్లడించింది.
తన ఫాలోయింగ్ పై నమ్మకంతో వెల్లానని కానీ నాలుగైదు రోజులకే వాళ్లు బయట గ్రూపులు ఫిక్స్ చేసుకుని వచ్చారని సరయు వెల్లడించింది. ఇంట్లో ఒక్కొక్క సభ్యుడి గురించి అరియానా అడగ్గా....ఉమా అమాయకురాలు అంటూ సరయు వ్యాఖ్యానించింది. ఆమెకు ఆట ఎలా ఆడాలో తెలుసని ఆమెను ఎప్పటికప్పుడు అవమానిస్తున్నారని అన్నారు. అని మాస్టర్ సీజన్ మొత్తం వరకూ ఓపెన్ కారని చెప్పింది. ఇక హౌస్ లో సిరి, యాంకర్ రవి మరియు సన్నీ, షణ్ముక్ నలుగురు ఒక గ్రూప్ అని వాళ్లు ముందే గ్రూప్ గా ఇంట్లోకి వచ్చారని సరయు వెల్లడించింది. యాంకర్ రవి ఎన్నో మాటలు చెబుతాడని కానీ అందులో విషయం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు సన్నీకి అసలు క్యారెక్టర్ ఏ లేదంటూ రెచ్చిపోయింది.