ప్రస్తుతం సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్ హీరోలు కూడా అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఒక సీరియల్ హిట్ పడితే చాలు తమకంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న సీరియల్ హీరోలలో నిరూపమ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పవచ్చు. నిరూపమ్ హీరోగా నటించిన కార్తీకదీపం ఓ రేంజ్ హిట్ అయ్యింది. కార్తీక కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్.... డాక్టర్ బాబు అనే పాత్రలో నటించి నిరూపమ్ ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సీరియల్ కు ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్ ను సైతం తలదన్నేలా కార్తీక దీపం సీరియల్ రేటింగ్ వచ్చిందంటే మామాలు విషయం కాదు.
ప్రతి రోజు ఈ సీరియల్ చిన్నా పెద్దా ముసలీ ముతకా అని తేడా లేకుండా ఎంతోమంది చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా కార్తీక దీపం హీరో నిరూపమ్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు... కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ రాజేందర్ గారు తమకు ఎంతో సహకరిస్తారని, అతను ఎంతో టాలెంటెడ్ అని చెప్పారు. తను నటించిన చంద్రముఖి సీరియల్ వచ్చి ఇప్పటి వరకూ పదేళ్లు అయ్యిందని మళ్లీ అంతకంటే కర్తీక దీపం సీరియల్ మంచి విజయం సాధించిందని చెప్పారు. కార్తీకదీపం సీరియల్ కు ఈ రేంజ్ లో క్రేజ్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతే కాకుండా తనకు నిరూపమ్ కంటే డాక్టర్ బాబు అని పిలిస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పారు.
అలా పిలుస్తున్నారు అంటే తన క్యారెక్టర్ ను ఎంతో మంది ప్రేమిస్తున్నట్టు అర్థం అని అన్నారు. ఇక కార్తీకదీపం సీరియల్ లో తనకు తల్లి గా నటిస్తున్న సౌందర్య అనే నటి వయసు తన కంటే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఎక్కువ అని చెప్పారు. తనకు చాలా యంగ్ మదర్ ఉన్నందుకు తాను ఎంతో లక్కీ అని అన్నారు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని... తాను కూడా ఆ సమయంలో పానిక్ అయ్యానని చెప్పారు. అంతేకాకుండా ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని సీరియళ్లను సాగదీసి తీయడం అనేది ఉండదని చెప్పారు కథ పరంగానే సీరియల్స్ ను తెరకెక్కిస్తారని చెప్పారు.