థియేటర్లో గొడవ గురించి లీక్ చేసిన మెహబూబ్.. ఏం జరిగిందంటే?
ఇది ఇలా ఉండగా థియేటర్స్ లో జరిగిన విషయం పై మెహబూబ్ సంచలన నిజాలను బయటపెట్టారు.. అదేంటి అనుకుంటున్నారా.. సెలెబ్రెటీలు సైతం ఈ పోస్టులకు కామెంట్ కూడా చేస్తున్నారు.. ఇకపోతే వీళ్ళు ఓ సినిమాకు వెళ్ళారు .. అక్కడకు ఆలి రేజా వచ్చాడు.. ఇద్దరు కలిసి ఫోన్ లో ఫోటో దిగారు. ఈ ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ సినిమా కూడా నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్ డాగ్.. సినిమా కథ మొత్తం సైనికుల మీద ఉంటుంది.
అందులో బిగ్ బాస్ ఫేం ఆలి రెజా కూడా కీలక పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద ఆలి కనిపించడంతో ఒక్కసారిగా వీరిద్దరు గట్టిగా కేకలు వేస్తూ అరిచారు. ఒక్క సారిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న ఓ మహిళ గొడవకు దిగింది. దీంతో కాసేపు అక్కడ వేడి వాతావరణం నెలకొంది. మహిళ గట్టిగా అరిచింది. ఇంకాసేపు అయితే కొడుతుందని అనుకున్నాం... కానీ ఆమె అలా చేయలేదు చిన్నగా చెప్పింది. ఇక మాస్క్ తీయడం తో గుర్తు పట్టి మీరా అంటూ కూర్చుంది.. అంటూ మెహబూబ్ పోస్ట్ కూడా చేశాడు. ఇది కాస్త వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..