దేవుడా.. సొహెల్ కూడా అలాంటి వాడేనా?
విషయానికొస్తే.. అవినాష్ అరియానాలది ఓ ట్రాక్ అయితే.. సోహెల్ అరియానాది మరో ట్రాక్. మొత్తానికి అరియానా మాత్రం అందరి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది. టామ్ అండ్ జెర్రీ అంటూ సోహెల్ అరియానా ట్రాక్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయిందే. అయితే ఆ ట్రాక్ కాస్త ఇప్పుడు రొమాంటిక్ ట్రాక్ అయ్యేలా కనిపిస్తోంది.ప్రస్తుతం అవినాష్ అరియానాలు కామెడీ స్టార్స్ షోలో ఎంతగా రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తమ మధ్య కుదిరిన కెమిస్ట్రీని బాగానే వాడుకుంటూ స్కిట్లు వేస్తూ షోను సక్సెస్ చేస్తున్నాడు అవినాష్. అలా అరియానాతో ప్రతీ స్కిట్‌లో ప్రేమికుడిగా, భర్తగా నటిస్తూ యుట్యూబ్ లోనూ ఇటు నెటిజన్ల లో బాగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
రేపు ప్రసారం కానున్న షో మాత్రం అందరినీ ఆకట్టుకుంది.. స్కిట్ కోసం అవినాష్ సొహేల్ ను తెచ్చుకున్నాడు. కానీ చివరికి అతని చేతే గాలి తీయించుకున్నాడు.ఆ తరువాత వర్షిణితో కలిసి సోహెల్.. అరియానాతో కలిసి అవినాష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశారు.సోహెల్ వర్షిణి ఇద్దరూ బాగానే రొమాన్స్ చేశారు.. అయితే అరియానా మాత్రం అవినాష్‌ను వదిలి సోహెల్ వద్దకు వెళ్లింది. అరియానా ఓ వైపు వర్షిణి మరో వైపు ఉండగా.. సోహెల్ బాగానే రొమాన్స్ చేశాడు. అయితే అవినాష్ ఎంతగా ప్రయత్నించినా కూడా అరియానా, వర్షిణి ఇద్దరూ పట్టించుకోలేదు... దీంతో అవినాష్ ఆటలో అరటిపండు అయ్యాడు..