ఇమ్యానుయేల్ తల్లిని పట్టుకుని ఏడ్చినా వర్ష..మంచి అబ్బాయి అంటూ..?

P.Nishanth Kumar
జబర్దస్త్ లో లవ్ జంటగా పేరు సంపాదించుకున్న జంట ఇమ్యానుయేల్, వర్ష.. ఈ షో ద్వారా ఎంతో లైఫ్ సెటిల్ అవడంతో పాటు లైఫ్ పార్టనర్ లు కూడా సెటిల్ అవుతున్నట్లు ప్రస్తుతం పరిస్థితి ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ఈ షో ద్వారా సుధీర్, రష్మీ ఎవర్ గ్రీన్ జంటగా నిలిచిపోయారు. వారు పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు కానీ టీవీ షోల్లో వారు ఇచ్చే బిల్డప్ మాత్రం అలాగే ఉంటుంది.. ప్రతి ఎపిసోడ్ లో వీఎరిన్ హైలైట్ చేయడానికి చూస్తుంటారు నిర్వాహకులు.. ఓ వైపు సోషల్ మీడియా లో వీరి మధ్య ఏదీ లేదని చెప్తూనే మరోవైపు టీవీ షో లో ఎదో ఉందన్నట్లు చూపిస్తున్నారు..
దాంతో వారిద్దరి మీద ఫోకస్ ఎక్కువయిపోతుంది.. ఇక తాజగా అలానే మరో జంట ను క్రియేట్ చేసింది సదరు షో.. వారే ఇమ్యానుల్, వర్ష.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. వీరిద్దరి మధ్య కూడా ఎదో నడుస్తుందన్నట్లు క్రియేట్ చేస్తుంది ఛానల్.. మరి వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.. ఇదిలా ఉంటే తాజాగా ఇమ్మాన్యుయల్ పాల్గొంటున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ షోలో జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లిదండ్రులు, అన్నను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఇమ్మాన్యుయల్ తన భావోద్వేగాన్ని ఆపులేకపోయాడు. తన కొడుకు తమను ఈ స్టేజ్‌పై నిలబెట్టడంపై ఇమ్మాన్యుయల్ తల్లి కూడా సంతోషం వ్యక్తం చేసింది. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకు చాలా మంచివాడని.. ఎంత మంచివాడో మాటల్లో చెప్పలేనని తెలిపింది. ఇక తన అన్న ప్రొత్సాహం లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని.. తన గురించి తన అన్న ఎంతో కష్టపడానని చెప్పాడు. ఇక ఈ స్టేజ్ మీదే ఇమ్మాన్యుయల్ తల్లిని వర్ష ఆలింగనం చేసుకుంది. ఇంత మంచి అబ్బాయిని తనకు ఇచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పింది. అయితే ఇదే సమయంలో ఇమ్మాన్యుయల్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన కొడుకు వల్ల వర్షకు ఎలాంటి సమస్య రాదని ఆమె స్టేజ్‌పై చెప్పింది. తన కొడుకు చాలా మంచివాడని తెలిపింది. మొత్తానికి జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లిని వర్ష ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: