టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు "1 నేనొక్కడినే" అనే సినిమాలో హీరో గా నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి సనన్ హీరొయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా కృతి సనన్ కి ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి వరుస పెట్టి హిందీ సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కేరిర్ను కొనసాగిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కృతి సనన్ తనను మాట్లాడుతూ ... నేను చిన్నప్పటి నుండి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. దానితో 1 నేనొక్కడినే సినిమా చేసే సమయం లో మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ మరియు స్టార్ డమ్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఇకపోతే ఆ సినిమాకు సుకుమార్ గారు దర్శకత్వం వహించారు. ఆయన ఎంతో గొప్ప దర్శకుడు. చాలా నిజాయితీగా ఉండేవారు. ఆ సినిమాలో నటించడం నాకు చాలా ఆనందాన్ని కలగజేసింది అని కృతి సనన్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కేరిర్ను ముందుకు సాగిస్తుంది.