మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను ఒక దాని తర్వాత ఒక దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి మీసాల పిల్ల అనే సాంగ్ను విడుదల చేశారు.
దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి శశిరేఖ అంటూ సాగే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సాంగ్కు విడుదల ఆయిన 24 గంటల్లో 14.9 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సాంగ్స్ విషయంలో మహేష్ బాబు హీరోగా రూపొందుల సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ ను బీట్ చేసింది. మహేష్ హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్కు విడుదల అయిన 24 గంటల సమయంలో 14.78 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ వ్యూస్ ను మన శంకర వర ప్రసాద్ గారు మూవీలోని శశిరేఖా సాంగ్ దాటేసింది.