సంక్రాంతి సినిమాలు.. మళ్లీ అదే పెంట..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అం టే చాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి . దానితో మన తెలుగు సినిమాలకు థియే టర్స్ అడ్జస్ట్ చేయడమే నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంతో కష్టం అవుతుంది . ఇక ఇదే సమయం లో ఇతర భాష సినిమాలను కూడా విడుదల చేసినట్లయితే వాటిని తెలుగు లో విడుదల చేయా లి అనుకుంటే ఆ సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలి అనుకునే నిర్మాతలకి , డిస్ట్రిబ్యూటర్లకు చాలా పెద్ద ఎత్తున కష్టాలు ఎదురవుతూ ఉంటాయి . అందుకు ప్రధాన కారణం సంక్రాంతి సీజన్ లో మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమాలే అనేకం విడుదల అవుతూ ఉంటాయి.


వాటికి దియేటర్లను అడ్జస్ట్ చేయడమే చాలా కష్టం అవుతుంది. ఇంకా డబ్బింగ్ సినిమాలకు థియేటర్లను ఇవ్వడం సాధ్యం కాదు అనే విషయంలో అనేక సందర్భాలలో పెద్ద ఎత్తైన రచ్చ నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని సందర్భాలలో కొంత మంది పెద్ద డిస్ట్రిబ్యూటర్లు తాము కొనుగోలు చేసిన డబ్బింగ్ సినిమాలకు తెలుగు సినిమాల కంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించిన సందర్భంలో కూడా ఇలా చేస్తే తెలుగు సినిమాలకు అన్యాయం జరుగుతుంది అనే స్థాయిలో రచ్చ నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగ సందర్భంగా మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమాలు అనేకం విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. దానితో ఈ సారి సంక్రాంతి పండక్కు కూడా డబ్బింగ్ సినిమాలకు థియేటర్లను కేటాయించినట్లయితే వాటి విషయంలో పెద్ద రచ్చ నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: