మోనాల్ , అఖిల్ మధ్య ఇంకా అది జరుగుతుందా.. అందుకే ఇలా..!!

Satvika
బిగ్ బాస్ 4 ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అయితే ఈ షో లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు పాపులర్ అయ్యింది మాత్రం మోనాల్.. రొమాన్స్ కోసమే హౌస్ లోకి వచ్చినదని అన్నారు. ఇక బిగ్ బాస్ కూడా ఆమెను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ వస్తున్నారు. అలా ఒక రేంజు లో మోనాల్ ఫేమస్ అయ్యింది. ఇది ఇలా ఉండగా అఖిల్ తో చేసిన రొమాన్స్ మాత్రం ప్రేక్షకులను ఆసక్తికి గురి చేసింది. ఇక హౌజ్ ‌లో వీరిద్దరి రొమాన్స్ మరియు వీరి రేలషన్ ప్రేక్షకుల ను ఎంత గానో ఆకట్టుకుందని చెప్పొచ్చు. 



ఇక ప్రేక్షకుల లో వీరిద్దరికి ఉన్న పాపులారిటీ కోసం చాలా సార్లు బిగ్ బాస్ మోనాల్‌ని ఎలిమినేట్ చెయ్యకుండా ఆమెను సేవ్ చేస్తూ చివరి వరకు వచ్చాడన్న కామెంట్లు కూడా అప్పట్లో బాగా ఊపందుకున్నాయి. ఇక పోతే వీరిద్దరి రిలేషన్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా కంటిన్యూ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక ఈ జంట ట్రాక్ ను మరింత క్యాష్ చేసుకునేందుకు మరో వైపు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లు కూడా చూస్తున్నాయి. ఈ నేపథ్యం లో స్టార్ మా ఛానల్ మోనాల్ మరియు అఖిల్ కి సంబంధించి ఇటీవల ఓ ప్రోగ్రాం ప్రోమోను కూడా విడుదల చేసింది. 



అసలు విషయానికొస్తే.. స్టార్ట్ మ్యూజిక్' ప్రోగ్రాం మూడో సీజన్ త్వరలో స్టార్ మాలో ప్రసారం కానున్న నేపథ్యంలో ఇందులో, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు పాల్గొని కనువిందు చెయ్యబోతున్నారట. తాజాగా ఈ ప్రోగ్రాం లో అఖిల్ పాల్గొన్న ప్రోమోను స్టార్ మా సిబ్బంది విడుదల చేసింది. ఆ ప్రోమోలో మోనాల్ వాయిస్ తో "అఖిలూ.. నన్ను మిస్ అవుతున్నావా? కళ్లు మూసుకో" అంటూ వినిపిస్తుంది. మొత్తానికి వీరిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు. అదేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: