బిగ్ బాస్ .. ఈ షో పేరు ఈ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. అక్కినేని కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో సీజన్ 4 ను ఇటీవలే పూర్తి చేసుకుంది.. గత మూడు సీజన్ల కన్నా కూడా ఈ సీజన్ కాస్త ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..అయితే అంతకు మించి విమర్శలు కూడా అందుకుంది.. ఈ షో విన్నర్ గా అభిజిత్.. రన్నర్ గా అఖిల్ వచ్చారు.. మొత్తానికి ప్రేక్షకుల అంచనాను ఎప్పుడు రీచ్ కాలేదు.. మొదటి నుంచి ప్రేక్షకులకు భారీ షాక్ ను ఇస్తూ వస్తుంది. ఈ సారి కూడా అదే చేసింది.
ఇకపోతే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన వారంతా కూడా ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేశారు.. జబర్దస్త్ అవినాష్ మాత్రం కాస్త హైలెట్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ బిగ్ బాస్ పై సంచలన కామెంట్లు చేశాడు. అవి కాస్త దుమారం రేపుతున్నాయి.అయితే అవినాష్.. జబర్దస్త్ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేయడం ద్వారా పది లక్షలు కట్టాల్సి వచ్చిందని.. ఆ పది లక్షలు కట్టి బిగ్ బాస్‌లోకి రావడం జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు అవినాష్..అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే పది లక్షలు కట్టాలని వాళ్లు చెప్పారు. నాకు ఫైనాన్సియల్‌గా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా.. పది లక్షలు కట్టాల్సిందే అని అన్నారు. నేను వాళ్లని తప్పుపట్టడం లేదు కానీ.. వాళ్ల రూల్స్ ప్రకారం వాళ్లు చేశారు.
నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని అదే కంపెనీని అప్పుగా డబ్బులివ్వమని అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. పది లక్షలు ఇస్తేనే బయటకు వెళ్ళమని చెప్పారు. అందరూ సాయం చేయడంతో బయటకు వచ్చానని అవినాష్ అన్నారు. పది లక్షలు కట్టినా అంతకంటే బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చింది. మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. నా అప్పులు క్లియర్ అయ్యాయి. అప్పులు లేకపోవడంతో హ్యాపీగా ఉన్నాను’ అంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు ముక్కు అవినాష్. పదమూడు వారాలు ఉన్న అవినాష్ కు రోజుకు రెండు లక్షలు చెల్లించినట్లు తెలిపారు.. ఈ లెక్కన అవినాష్ బాగానే వెనకేసుకున్నాడు..మళ్లీ జబర్దస్త్ కు వెళ్తాడా లేదా అనేది చూడాలి...