బి బి 4: అభిజిత్ కి హ్యాండిచ్చిన హారిక... !

VAMSI
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రియాలిటీ షో.. దాదాపు చివరి దశకు చేరుకుంది. అందుకే ఎంటర్టైన్మెంట్ పరిధి మరింత పెంచారు బిగ్ బాస్. గ్రాండ్ ఫినాలేకు చేరుకోనున్న సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య ఆసక్తి నెలకొంది. ఫినాలేకు చేరుకునే కంటెస్టెంట్లు ఎవరో... హౌస్ నుండి అవుట్ అయ్యేది ఎవరు..?? ఈరోజు తేలిపోనుంది.  ఇక హౌస్ విషయానికొస్తే
ఈవారం బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్‌లో సోహెల్, అరియానా గొడవ పడిన సంగతి తెలిసిందే. అరియానా, సోహెల్‌కు నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.
‘‘కోపం టాస్క్‌లో అయితే కంట్రోల్ చేసుకుంటావు.. లైఫ్‌లో అయితే కంట్రోల్ చేసుకో లేవా?’’ అని సోహెల్‌ను నాగార్జున ప్రశ్నించారు. ‘‘నిన్న హారిక చేసినప్పుడు ఫీలయినప్పుడు.. నిన్న నువ్వు చేసింది ఏంటిది అని థర్డ్ పర్సన్‌ను ఆమె తీసుకొచ్చింది’’ అని అరియానాను ప్రశ్నించి వారి పొరపాట్లను వారు తెలుసుకునేలా వివరించి మళ్లీ అలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పారు నాగ్. ఆ తర్వాత అసలైన టాస్క్ మొదలుపెట్టాడు నాగార్జున. ఇంటి సభ్యులందరూ కూడా మిగతా వారి గురించి ఫస్ట్ ఇంప్రెషన్ మరియు లాస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ తమ అభిప్రాయాలను తెలియజేశారు ఇంటి సభ్యులు.
ఈ క్రమంలో హారిక వంతు వచ్చినప్పుడు అఖిల్ పేరు మొదటి గా చెప్పి తన ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ లాస్ట్ ఇంప్రెషన్ చెప్పింది హారిక. తనకు నచ్చిన వారి లిస్టులో మొదటగా అఖిల్ ఫోటోను, తర్వాత అభిజిత్, మోనాల్ ఫోటోలను పైనుంచింది. తనకు నచ్చని వారి లిస్టులో... అరియానా మరియు సోహెల్ ఫోటోలను పెట్టింది. ఇది చూసిన వారందరికీ అభిజిత్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అఖిల్ కి ఇస్తూ మొదటగా తన ఫోటోనే పెట్టినట్లు అనిపించింది. ఇక అభిజిత్ పై తనకు ఉన్న ఇష్టం కాస్త తగ్గినట్లుగా కనిపించింది. వారిపై తన ఫస్ట్ ఇంప్రెషన్ మరియు లాస్ట్ ఇంప్రెషన్ చెప్పే సందర్భంలో కూడా అఖిల్ ను మరీ ఎక్కువగా పొగిడి నట్లు.... అభిజిత్ ని మెచ్చుకుంటూనే విమర్శిస్తున్నట్లు అనిపించింది. దీన్ని చూస్తుంటే ఇప్పుడు హారిక దృష్టిలో అఖిల్ హీరోగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: