బుల్లితెర: మరోసారి 'వావ్' అనిపిస్తున్న సాయి కుమార్!

Durga Writes

సాయి కుమార్.. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని కళ్లెర్రజేసి గర్జించే అగ్ని! అంటూ అందరిని ఆకట్టుకున్న సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ తన ప్రేక్షకుల కోసం వచ్చేస్తున్నాడు. అయితే బుల్లితెరపైకి వస్తున్నాడు. ఏ ఛానెల్ అనుకుంటున్నారా? ఇంకే ఛానెల్ అండి.. అదే ఈటీవీ. షో ఏది అనుకుంటున్నారా? అదేనండీ.. 'వావ్' సీజన్ త్రీ. 

 

 

ఇప్పటికే రెండు సీజన్స్ తో ప్రేక్షకులను అలరించిన సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ ఓ అద్భుతమైన సీజన్ తో ముందుకు రానున్నాడు. నలుగురు సెలబ్రిటీస్.. నాలుగు రౌండ్లు.. పది లక్షల క్యాష్.. ఐ యామ్ బ్యాక్ విత్ వావ్ త్రీ అంటూ బుల్లితెరపై అదిరిపోయే ప్రోమో తో ఎంట్రీ ఇచ్చాడు సాయి కుమార్. 

 

 

అయితే సాయి కుమార్ వావ్ కార్యక్రమంతో బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో గ్యాప్ తీసుకున్న సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు వావ్ 3 తో ముందుకు వచ్చేశాడు. ఇంకా ఈ షో త్వరలోనే ఈటీవీలో ప్రసారం కానుంది. 

 

 

ఇంకా వావ్ సీజన్ 3 గేమ్ షో టీజర్‌ను ఇప్పుడే విడుదల చేశారు. ఇంకా ఈ 'షో'లో అదిరిపోయే డైలాగులు చెప్పాడు. హీరో రేంజ్ ఎంట్రీతో అదరగొట్టేశాడు. ఐ యామ్ బ్యాక్ విత్ వావ్ త్రీ అంటూ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చేశాడు. జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్‌లో ఈ షో ఈటీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు హిట్ అయ్యాయి. మరి ఈ షో ఎంతపెద్ద హిట్ అవుతుందో చూడాలి.  

 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/E_07Wu2CbAE" width="657" height="368" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: