భారత జట్టులో.. అతన్ని తీసుకుని ఉంటే బాగుండేది : శరత్ కుమార్

praveen
ఎన్నో రోజులుగా భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఉత్కంఠకు ఇటీవల తెరపడింది. ఏకంగా టీమ్ ఇండియా అభిమానులందరూ   కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనే విషయంపై ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ప్లేయర్లకు తప్పకుండా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుంది అని క్రికెట్ విశేషములు కూడా అంచనా వేశారు.

 అయితే ఇటీవల ఈ ఉత్కంఠకు తెరపడింది. ఏకంగా టి20 వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలను అటు బీసీసీఐ ప్రకటించింది. అంతేకాదు ఇక రిజర్వుడు ఆటగాళ్ళు ఎవరు అన్న విషయాన్ని కూడా వెల్లడించింది. అయితే కేఎల్ రాహుల్ లాంటి కీలకమైన ప్లేయర్లను సెలెక్టర్లు వరల్డ్ కప్ జట్టు ఎంపిక విషయంలో పక్కన పెట్టడం గమనార్హం. అదే సమయంలో ప్రస్తుతం ఐపిఎల్ లో బాగా రానిస్తున్న ఆటగాళ్లను కూడా పరిగణలోకి తీసుకోలేదు  ఏకంగా ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యా, సిరాజ్ లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేయడంతో ప్రస్తుతం విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బుమ్రా తప్ప ఇక టి20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన జట్టులో మిగతా ఫేసర్లు పెద్దగా ఫామ్ లో లేరు.

 ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్న మయాంక్ యాదవ్ లేదా నటరాజ్యం లాంటి వాళ్ళని ఎంపిక చేసి ఉంటే బాగుండేది అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి   ఇదే విషయం గురించి అటు నటుడు శరత్ కుమార్ కూడా స్పందించాడు.  వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టుపై నటుడు శరత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశం అన్న భారత జట్టు అన్న మాకు ఎప్పుడు ఇష్టమే. కానీ తమిళ పేర్లు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. నటరాజన్ బౌలింగ్ వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టం. డెత్ ఓవర్లలో  అతను అద్భుతమైన యార్కర్లు సంధిస్తాడు. అతని తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అసలు ఆలస్యం చేయవద్దు అంటూ సూచించాడు శరత్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: