బుల్లి పిట్ట: మార్కెట్లోకి సాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్..!

Divya
ప్రస్తుతం కష్టమర్ల అంచనాలకు అనుగుణంగా వినూత్న రీతిలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో సాంసంగ్ ఎప్పుడూ ముందుంటుంది అని మరొకసారి నిరూపించింది. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఆలోచనలకు అత్యాధునికంగా తయారు చేసి మరీ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉండడం గమనార్హం.  ఈ క్రమంలోనే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ A14 5g  మోడల్ ను సాంసంగ్ ఇటీవల లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైజ్ ఫీచర్స్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయని తెలుస్తోంది.
సాంసంగ్ గెలాక్సీ A14 5g స్మార్ట్ ఫోన్  4GB రామ్ +  64 జిబి స్టోరేజ్ వేరియంట్  ధర రూ. 16,499 గా ఉంది.  అలాగే 6GB ర్యామ్,  128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999గా , 8 GB వేరియంట్ ధర రూ.20,999గా ప్రకటించారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ మీకు డార్క్ రెడ్, బ్లాక్ , లైట్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది.  ఈనెల 20వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్  సామ్సంగ్ అధికారిక వెబ్సైట్ లేదా శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ పార్ట్నర్ స్టోర్స్ తో పాటు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారంలో కూడా అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మార్కెట్లోకి రానున్న ఈ శాంసంగ్ గెలాక్సీ A14 5g ఫీచర్స్ ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
167.7 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ స్మార్ట్ ఫోన్ 78.0 మిల్లీమీటర్ల వెడల్పు 9.1 మిల్లీమీటర్ల మందంతో 202 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 13 ఓఎస్ ఆండ్రాయిడ్ ఆధారిత వన్ యు ఐ 5.2 కష్టమ్ స్కిన్ పై పనిచేస్తుంది అని కంపెనీస్ స్పష్టం చేసింది.  90 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో కూడిన 6.6 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. కస్టమర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో ఇతర గ్యాలక్సీ వినియోగదారులతో వీడియోలు ఫోటోలు భద్రంగా షేర్ చేయవచ్చు అంతేకాకుండా నాలుగు సంవత్సరాల పాటు ఈ ఫ్యూచర్ కి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇవ్వనుంది. 5000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీతో రానంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: