బుల్లి పిట్ట: రూ.6,799 లకే స్మార్ట్ టీవీ..!!

Divya
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ టీవీ కొనుగొలు చేయడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రూ.6799 రూపాయలకి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసుకోవచ్చట. భారతదేశంలోని ప్రజలు బిగ్ స్క్రీన్ ల పైన ఎక్కువగా మోజు చూపిస్తున్నారు. అయినప్పటికీ స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరకే లాంచ్ చేయడం చెప్పుకోదగ్గ విషయమని చెప్పవచ్చు. ప్రతి భారతీయులు కూడా ఇన్ఫినిక్స్ బ్రాండెడ్ నుంచి విడుదలవుతున్న స్మార్ట్ టీవీ లను కూడా సరసమైన ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

తాజాగా Y-1 సిరి స్మార్ట్ టీవీలను ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రాండ్ గత సంవత్సరం 32 అంగుళాల, 43 అంగుళాలు కలిగిన టీవీని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ కంపెనీ తాజాగా 24Y1 ,2A అంగుళాల కాంపాక్ట్ మరియు చాలా సరసమైన స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ 24Y1 టీవీ ధర విషయానికి వస్తే.. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ లాంచ్ చేసిన 32 ఇంచుల టీవీ మోడల్ ధర.. రూ.10,000 రూపాయల కాగా ఇప్పుడు కంపెనీ 24 అంగుళాల కాంటాక్ట్ టీవీని అతి తక్కువ ధరకే విడుదల చేసింది.
ఇక ధర విషయానికి వస్తే రూ.6,799 రూపాయలకి లాంచ్ చేయబడింది. ఈ కొత్త 24 అంగుళాల స్మార్ట్ టీవీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇది అత్యంత సరసమైన స్మార్ట్ టీవీలలో ఒకటి ఈ కొత్త స్మార్ట్ టీవీ మార్చి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో కలదు. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే..1366X768 పిక్సెల్ HD క్వాలిటీతో కలదు. 24 అంగుళాల డిస్ప్లే తో కలిగి ఉంటుంది.16 W ఆడియో అవుట్ ఫుట్ తో కలదు. HDMI,USB రెండు సపోర్ట్లు కలదు. ఇక వీటితోపాటు ఓటీటి యూట్యూబ్ వంటి యాపులు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: