TVS Apache RTR 160 4V: కొత్త ఎడిషన్ సూపర్ అంతే?

ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 TVS apache rtr 160 4V స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు 'పెర్ల్ వైట్ కలర్‌'లో సరికొత్త లైట్ వెయిట్ బుల్‌పప్ ఎగ్జాస్ట్‌ను పొందుతుంది.ఈ బైక్ బాడీ చాలా వరకు కూడా పెర్ల్ వైట్ కలర్‌లో ఉన్నప్పటికీ ఫ్యూయల్ ట్యాంక్, సీటు ఇంకా వెనుక చక్రం  మధ్య భాగంలో రెడ్ కలర్ ని చూడవచ్చు. ఈ కలర్ అనేది ఈ బైక్ కి మరింత ఆకర్షణను తీసుకువస్తుంది.టీవీఎస్ అపాచే స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు దాని పాత మోడల్ కంటే కూడా ఒక కేజీ తక్కువ బరువుతో లభిస్తుంది. ఇంకా అంతే కాకుండా ఇందులో అడ్జస్టబుల్ క్లచ్ ఇంకా బ్రేక్ లీవర్‌లు, టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect), గేర్‌షిఫ్ట్ ఇండికేటర్ ఇంకా అలాగే ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ లతో కూడిన ఆల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి. అయితే దీని ఇంజిన్ లో మాత్రం ఎటువంటి మార్పులు లేదు.


ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త apache rtr 160 4V స్పెషల్ ఎడిషన్ పెర్ల్ వైట్ కలర్ ధర వచ్చేసి రూ. 1,30,090 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇక ఈ కొత్త బైక్ కొనుగోలుచేయాలనుకునే  కస్టమర్లు కంపెనీ  డీలర్‌షిప్‌ల నుండి దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్  ఎక్కువ ఆకర్షణీయమైన కాస్మొటిక్ అప్డేట్స్ కలిగి ఉంది.అందువల్ల తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగె అవకాశం ఉంది.ఈ కొత్త TVS apache rtr 160 4V స్పెషల్ ఎడిషన్ అదే 159.7 సిసి ఆయిల్-కూల్డ్, SOHC ఇంకా ఫ్యూయల్-ఇంజెక్ట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ 9250 ఆర్‌పిఎమ్ తో 17.39 బిహెచ్‌పి పవర్ ఇంకా 7250 ఆర్‌పిఎమ్ తో 14.73 ఎన్ఎమ్ టార్క్ ని అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది. అదే సమయంలో ఇందులో అర్బన్, స్పోర్ట్స్ ఇంకా అలాగే రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: