బుల్లి పిట్ట: బడ్జెట్ ధరల్లోనే 5జి మొబైల్..!!
అందులో భాగంగానే కేవలం రూ.11,999 రూపాయలకి అత్యధిక 5g మొబైల్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మొబైల్ డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మొబైల్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకొనే ఫీచర్స్ తో అధునాతన టెక్నాలజీతో ఈ మొబైల్ రాబోతోంది. ఈ మొబైల్ మోడల్ విషయానికి వస్తే..HOT 20 5g మోడల్‌గా నామకరణం చేశారు ఈ మొబైల్లో 50. mp డ్యూయల్ కెమెరాతోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 8 ఎంపీ మెగాపిక్సల్ కెమెరాను అందించనుంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే 500 MAH సామర్థ్యంతో కలిగి ఉంటుంది.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ బ్రాండ్ వైఫై, డ్యూయల్ సిమ్ తదితర ఫీచర్లు కలవు. ఈ మొబైల్ మూడు కలర్లలో లభిస్తుంది.4GB RAM+64 GB స్టోరేజ్ మెమొరీ తో ఈ మొబైల్ కలదు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని మొబైల్స్ కు పోటీగా ఈ మొబైల్ వస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం 180 W చార్జింగ్ సపోర్టు కలిగిన INFINIX zero ULTRA మొబైల్ ని కూడా విడుదల చేసింది ఇందులో 5g మొబైల్ తో పాటు...200 mp కెమెరా ఉండడం గమనార్హం.