టామ్ మూడీ కి గ్రీన్ సిగ్నల్..!! టీమిండియా కొత్త కోచ్ గా రవిశాస్త్రికి బిసీసీఐ మొండి చేయి చూపనుందా..?

Gowtham Rohith
వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడం తో జట్టులోని డొల్లతనం బయటపడింది. దీనితో బీసిసిఐ ప్రక్షాణళన దిశగా అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగా హెడ్ కోచ్ తో సహా, మిగిలిన పోస్టులు భర్తీ చేయటానికే దరరఖాస్తులను బిసీసిఐ జూలై ముప్పై వరకు ఆహ్వానించింది.


 రవిశాస్త్రి తో సహా పలువురు కోచ్ పదవి రేసులో నిలిచారు. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్ గా టామ్ మూడీ ఖరారయ్యారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వివరాలలోకి వెళితే ఐపీఎల్ ప్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న టామ్ మూడీ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది.


టీమిండియా కోచ్ గా టామ్ మూడీ బీసీసీఐ ఖరారు చేసిందని, అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని షోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనంలో రవిశాస్త్రికి బోర్డు మొండిచెయ్యి చూపనుందా అనే చర్చ  నెట్టింట్లో మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: