ఎట్టకేలకి ముంబై “మొదటి విజయం ”

Bhavannarayana Nch

ఐపీఎల్ సీజన్ -11 లో భాగంగా జరుగుతున్నా హోరా హోరీ పోరులో గత మూడు మ్యాచ్ లనుంచీ వరుసగా అపజయాలు చవిచూస్తున్న ముంబై ఇండియన్స్ నిన్న రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన నాలుగో మ్యాచ్ లో బోణీ కొట్టింది..దాంతో ముంబై టీం యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు..రాయల్ చాలెంజ్ ని 167/8 పరుగులకే కట్టడి చేసిన ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకి తొలి విజయాని నమోదు చేసుకుంది..అయితే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 214 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్  ముందు ఉంచింది..

 

అయితే లక్ష్య ఛేదనలో రాయల్స్ విఫలం అయ్యింది..ఈ ఇన్న్గింగ్స్ లో విరాట్‌ కోహ్లి 92 పరుగులుతో నాటౌట్‌ గా నిలిచాడు అయితే కోహ్లీ తప్ప జట్టులో మిగిలిన వారు సరిగా రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లతో మెరవగా, మెక్లీన్‌గన్‌, బుమ్రాలకు తలో రెండు వికెట్లు లభించాయి. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ కేవలం 52 బంతుల్లో 94 పరుగులు చేయగా...లూయిస్‌65 పరుగులని 42 బంతుల్లోచేశాడు..

 

ముంబై ఇండియన్స్‌ తొలి ఓవర్‌ మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లను నష్టపోయింది...ఆర్సీబీ పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ బౌల్డ్‌ కాగా, రెండో బంతికి ఇషాన్‌ కిషాన్‌ సైతం బౌల్డ్‌గా వెనుదిరిగాడు.  ఈ ఇద్దరూ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం ఇక్కడ గమనార్హం.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: