“బంగారు” కొండ మీరాభాయ్..గోల్డెన్ బోణీ

Bhavannarayana Nch

ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ క్రీడలలో భారత్ బోణీ బాగుంది..క్రీడల మొదటి రోజే మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత అమ్మాయి సాయిఖోమ్ మీరాభాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది...ముందుగా భారత్ తొలుత రజత పతకంతో బోణీ చేసింది. పురుషులు వెయిట్ లిఫ్టింగ్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన గురురాజా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

 

అయితే భారత్ తరుపున  2018 క్రీడల్లో పాల్గొని తొలి స్వర్ణం నెగ్గిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. తన అత్యద్భుతమైన ప్రదర్శనకి గాను అమితాబ్ ప్రసంసల జల్లు కురిపిస్తున్నాడు..దేశవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు,నెటిజన్లు మీరా భాయ్ ని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు... తన శరీరం బరువుకు రెట్టింపు కంటే ఎక్కువ బరువును ఎత్తడం ద్వారా (103 కిలోలు, 107 కిలోలు, 110 కిలోలు) ఓవరాల్ గేమ్ రికార్డును సొంతం చేసుకుంది. 

 

అయితే మీరాభాయ్ చాను భారత రైల్వేలో సీనియర్ టికెట్ చెకర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 194 కేజీలను ఎత్తి జాతీయ రికార్డును నెలకొల్పి స్వర్ణం గెలుచుకొని కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. 22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: