భారత చదరంగ దిగ్గజం పెండేల హరికృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారత చదరంగ క్రీడాకారుడు ఎవరంటే..విశ్వనాథ్ ఆనంద్ అని చెప్పేవారు. ఇప్పుడు పెండేల హరికృష్ణ ఆ స్థాయికి ఎదుగుతున్న యువ క్రీడాకారుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ క్రీడలో ప్రస్తుతం భారతదేశంలో ఇతను రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
2001లో దేశంలోనే అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డు స్థాపించాడు. ఈ రికార్డును పరిమార్జిన్ నేగి 2006లో అధికమించాడు. 2004నవంబర్లో ప్రపంచ జూనియర్ సెస్ చాంపియన్షిప్ సాధించాడు. గ్రాండ్ మాస్టర్ పెండేల హరికృష్ణ ఓ ఇంటి వాడు కానున్నాడు. అతని పెళ్లికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతే కాదు మనోడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా సెర్బియా చెస్ క్రీడాకారిణి నదెడ్జా. అంతర్జాతీయ స్థాయిలో చెస్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన వేళ, తనకు పరిచయం అయిన సెర్బియా చెస్ క్రీడాకారిణి నదెడ్జాను తాను వివాహం చేసుకోనున్నట్టు హరికృష్ణ మీడియాకు తెలిపాడు.
మార్చి 3వ తేదీన హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తమ పెళ్లి జరుగుతుందని చెప్పిన ఆయన, తనకు కాబోయే భార్య ఫొటోతో కూడిన వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మీడియాకు విడుదల చేశాడు. ఈ వివాహానికి పలువురు క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు కూడా రాబోతున్నట్లు సమాచారం.