యాషెస్ నాల్గో టెస్ట్ లో ఆసీస్ విజయం.. ట్రోఫీ పదిలం
దాంతో ఓ దశలో ఇంగ్లాండ్ 8వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి పరాజయం అంచున నిలిచింది. అయితే ఈక్రమంలో ఓవర్ టోన్ ,లీచ్ అద్భుతంగా పోరాడారు. మరో 15ఓవర్ల పాటు వీరు క్రీజ్ లో ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేదే. కానీ పార్ట్ టైం బౌలర్ లబుషెన్లీచ్ ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆతరువాత కాసేపటికే ఓవర్ టోన్ చివరి వికెట్ గా వెనుదిరగడం తో ఆసీస్ జయకేతనం ఎగుర వేసింది.
అద్భుతమైన స్వింగ్ తో కమ్మిన్స్ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ భరతం పెట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్ జాయ్ డెన్ లీ 53 పరుగులతో రాణించాడు. కాగా మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ తో మ్యాచ్ ను శాసించిన స్టీవెన్ స్మిత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.