రోహిత్ గైర్హాజరు.. అతనిలో కూడా కెప్టెన్సీ సత్తా ఉందంటున్న పాంటింగ్?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా టీం ఇండియా జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ ఎప్పుడు జరిగిన కూడా క్రికెట్ ప్రపంచం మొత్తం ఇక ఈ టెస్ట్ సిరీస్ పై ఒక కన్నెస్తూ ఉంటుంది. అగ్రశ్రేణి టీమ్స్ మధ్య జరిగే హోరాహోరీ పోరును చూసి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే రెండు టీమ్స్ కూడా ఈ టెస్ట్ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి.

 గత కొన్నెళ్ల నుంచి బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భారత జట్టే పైచేయి సాధిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ కు ఇప్పుడు మరోసారి వేలయ్యింది. మరికొన్ని రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పయనం అయింది. అయితే ఇక ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ కి మొదటి టెస్టులో అటు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడు. రోహిత్ భార్యా డెలివరీ ఉన్న నేపథ్యంలో ఇక ఇలాంటి అపురూపమైన క్షణాన్ని ఆస్వాదించాలని రోహిత్ బీసీసీఐని సెలవు కోరగా.. ఇక ఈ సెలవు మంజూరు అయిందట.

 దీంతో ఇలా మొదటి టెస్ట్ కు రోహిత్ శర్మ గైర్హాజరితో భారత జట్టును కెప్టెన్ గా ముందుకు నడిపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్ గైర్హాజరి నేపథ్యంలో భారత జట్టును సమర్ధవంతంగా నడిపించగలిగే సత్తా బౌలర్ బుమ్రాకు ఉంది అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా సీనియర్ బౌలర్ ఎప్పుడు బౌలింగ్ చేయాలో అతనికి తెలుసు. కెప్టెన్సీ తో పాటు బౌలింగ్ బాధ్యతలను కూడా బ్యాలెన్స్ చేయగలడు. కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు కూడా అతనికి అందుబాటులో ఉన్నారు. దీంతో అతను కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అవ్వగలడు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: