ఇప్పుడు టీమిండియాకు.. అతని అవసరం ఉంది : ఉతప్ప

praveen
మొన్నటి వరకు మూడు ఫార్మట్లలో  పటిష్టంగా కనిపించిన భారత జట్టు.. ప్రత్యర్థుపై పైచేయి సాధించిన భారత జట్టు.. ఇక ఇప్పుడు అంతే బలంగా కనిపిస్తుందా అంటే అవును అని చెప్పలేకపోతున్నారు భారత జట్టు అభిమానులు. ఎందుకంటే ఇటీవల టీమ్ ఇండియాకు అంతటి ఘోర పరాభవం ఎదురయింది. మొన్నటి వరకు భారత జట్టును సొంత గడ్డపై కొట్టే టీం మరొకటి లేదు అని అందరూ బల్లగుద్ది మరి చెప్పేవారు. కేవలం భారత క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు ఇక క్రికెట్ పండితులు కూడా ఇదే చెప్పేవారు. కానీ ఇటీవల న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చి టీమ్ ఇండియాను సొంత గడ్డం మీదే దెబ్బ కొట్టింది. అది కూడా క్లీన్ స్వీప్ చేసేసింది.

 దీంతో ఈ ఓటమిని అటు భారత జట్టు అభిమానులు ఎవరూ కూడా కాస్తయినా జీర్ణించుకోలేకపోతున్నారు అనడంలో సందేహం లేదు. అయితే మరికొన్ని రోజుల్లో అటు టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో వారి సొంత దేశంలోనే ఏకంగా టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఎలా రానిచబోతుంది అని తలుచుకుంటేనే భయపడిపోతున్నారు భారత అభిమానులు. ఎందుకంటే ఇటీవల కివీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత బ్యాటింగ్ విభాగం ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏం జరగబోతుందో అనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొన్నాయి అని చెప్పాలి.

 ఇలాంటి సమయంలో ఇక టెస్టు స్పెషలిస్ట్ బ్యాచ్ మెన్ అయిన పూజార జట్టులోకి వస్తే బాగుంటుంది అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప స్పందించాడు. ప్రస్తుతం జట్టుకి పూజార అవసరం ఉంది  అంటూ పేర్కొన్నాడు. అతన్ని గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకపోవడం భారత మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పిదం అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ జట్టులో పూజారకు చోటు ఇవ్వడం ప్రస్తుతం ఒక అవసరం. ఓపెనింగ్ నుంచి ఆరో ప్లేస్ వరకు అందరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లే. పూజార, రాహుల్ ద్రవిడ్, విలియంసన్ లాంటి ఆటగాళ్లకు టెస్ట్ జట్టులో ఎప్పుడూ చోటు ఉంటుంది అంటూ రాబిన్ ఉతప్ప చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: