ఇక ఆ కెప్టెన్ వేస్ట్.. టైం వచ్చేసింది.. మార్చేయండి.. మిథాలీ షాకింగ్ కామెంట్స్?

praveen

భారత మహిళల క్రికెట్ జట్టు, యూఏఈలో జరుగుతున్న 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన సంగతి అందరికీ తెలిసిందే. భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ మొదటి దశలోనే భారత్ జట్టు ఎలిమినేట్‌ కావడంపై తీవ్ర స్థాయిలో స్పందించింది. విషయం ఏమిటంటే... దాదాపు 3 సంవత్సరాలుగా భారత మహిళల క్రికెట్లో అస్సలు పురోగతి అనేదే లేదని, తాజాగా టీ20 ప్రపంచకప్‌లో ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని మిథాలీరాజ్‌ అభిప్రాయ పడింది. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ భారత జట్టు ప్రదర్శనను బహిరంగంగా విమర్శించడం ఇపుడు చర్చనీయాంశమైంది.
మరీ ముఖ్యంగా ఆమె బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోని సమస్యలను వేలెత్తి చూపింది. జట్టులో ఎలాంటి అభివృద్ధి లేకపోవడమే నాకౌట్ దశకు చేరుకోలేకపోవడానికి కారణమని ఉదహరిస్తూ మరీ చెప్పింది. ఈ క్రమంలోనే కెప్టెన్ ని ఉద్దేశించి మ్యాచ్‌కు ముందు వ్యూహ రచన, ప్రణాళికలను అమలు చేయడాన్ని ప్రశ్నించింది. అదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్ గురించి మిథాలీ మాట్లాడుతూ, "బ్యాటింగ్‌ ఆర్డర్‌లో జట్టుకు స్పష్టమైన ప్రణాళిక ఎక్కడా కనబడలేదు. టోర్నమెంట్ సమయంలో కొందరి పొజిషన్లపై అయితే చాలా గందరగోళం నెలకొంది. బ్యాటింగ్ లైనప్‌లో కీలక స్థానాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ వంటి ప్లేయర్లు మారారు. ఇలాంటివి క్లిష్టమైన సమయాల్లో జట్టును తీవ్రస్థాయిలో నష్ట నష్టపరుస్తాయనే విషయం కెప్టెన్ ఎలా విస్మరించారు?" అని ప్రశ్నించింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ... "ప్రపంచ కప్ కోసం కనీసం 70-80% రోపొందించిన ప్రణాళికలను టోర్నమెంట్‌లో విజయవంతంగా ఆచరణలో పెట్టాలి. బ్యాటింగ్ లైనప్‌లో కీలకమై నంబర్ 5, నంబర్ 6 వంటి స్థానాలకు ఆటగాళ్లను గుర్తించడానికి ఇది సరైన వేదిక. ముందున్న పెద్ద సవాలుకు సిద్ధం కాకుండా, ఆసియా కప్‌ను గెలవడంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలోనే పొరపాట్లు జరిగాయి. ఆసియా కప్ సమయంలో ప్రపంచ కప్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు అస్సలు ఎక్కడా అనిపించలేదు." అని తెలిపింది. ఈ క్రమంలోనే మిథాలీ జట్టు సారధిని మార్చాల్సిన తరుణం ఆసన్నం అయింది అంటూ కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: