వెంకటేష్ చిత్రంలో.. నారావారబ్బాయి.. ఎవరంటే..?

Divya
విక్టరీ వెంకటేష్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం "ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47". ఈ సినిమా టైటిల్ విషయంలోనే అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు. వెంకటేష్ సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్స్ పోస్టర్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ చిత్రంలో మరో హీరో భాగం కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు నారా రోహిత్. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వినికిడి. ఇదే ఈ సినిమాలో చాలా కీలకంగా మారుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత్ర నచ్చడంతో కూడా నారా రోహిత్ వెంటనే ఓకే చెప్పారని ,త్వరలోనే సినిమా షూటింగ్లోకి జాయిన్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా అంటే హీరోతో పాటుగా మరొక నటుడు హైలెట్ గా కనిపిస్తూ ఉంటారని ఎన్నో సినిమాలలో చూసే ఉన్నాం.



గత సినిమాలలో కూడా ఎంతోమంది నటులను చూపించారు త్రివిక్రమ్. ఇప్పుడు ఆదర్శ కుటుంబం చిత్రంలో నారా రోహిత్ ను తీసుకోబోతుండడం గమనార్హం. నారా రోహిత్ కెరియర్ ప్రారంభం నుంచి చాలా డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి పలు చిత్రాలను గెస్ట్ రోల్స్లలో కనిపిస్తున్న నారా రోహిత్ గత ఏడాది బైరవం సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత సుందరకాండ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నారా రోహిత్ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్నారని తెలిసి అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: