అనసూయ...ఎప్పుడు ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే అనసూయ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అదేంటంటే తాను త్వరలోనే కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఏ ప్లాట్ ఫామ్ లో బ్లాగ్ స్టార్ట్ చేయాలో మీ అభిప్రాయం తెలపండి అంటూ అభిమానులకు ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇక అనసూయ పోస్ట్ కి కొంతమంది ఇంస్టాగ్రామ్, యూట్యూబ్లో బ్లాగింగ్ చేయమని అంటే మరి కొంతమంది ఏమో wix, Squarespace, word press. org వంటి ప్లాట్ఫామ్స్ పేర్లను సజెస్ట్ చేశారు. అయితే ఇంకొంతమంది ఫాలోవర్స్ మాత్రం అందర్నీ అడిగే బదులు చాట్ జీపీటీని అడిగితే ఎందులో బ్లాగ్ చేయాలో అదే చెబుతుంది కదా అని పోస్ట్ పెట్టగా..
ఈ పోస్ట్ పెట్టిన వారికి అనసూయ కౌంటర్ ఇస్తూ.. నేను మనుషుల్ని మాత్రమే నమ్ముతాను చాట్ జీపిటిని నమ్మను అంటూ రిప్లై ఇచ్చింది. ఇక మరో నెటిజన్ అక్క మీరు ఇంత సడన్గా బ్లాగ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు.ఆ బ్లాగ్ లో ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నారు అని ప్రశ్నించగా.. నా మనసులో ఎప్పటినుండో కొన్ని అంశాలు మెదులుతున్నాయి. వాటిని బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ బ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను. ఉదాహరణకు మహిళలను తక్కువ చేస్తూ పురుషులను ప్రశంసించడం, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు వారికి అవకాశాలు ఇవ్వకుండా వేరే ఇండస్ట్రీ వారిని ఆదరిస్తారు.తెలుగు వారిపై ఎందుకు ఈ వివక్షత చూపిస్తున్నారు. స్త్రీ,పురుషుల మధ్య తేడా ఎందుకు చూపిస్తున్నారు?
టాలీవుడ్ లో మగ, ఆడ అనే తేడాను చూపించడం, అసలు టాలీవుడ్ లోనే ఎందుకు ఆడ,మగ విషయంలో ఇలా వివక్షత చూపిస్తారు.. ముఖ్యంగా గోతికాడ నక్కల్లా ఎవరు ప్రవర్తిస్తారో స్పష్టంగా నేను నా బ్లాగ్లో చెప్పాలని నిర్ణయించుకున్నాను. అంటూ చివర్లో IYKYK అని ఒక వర్డ్ ని జోడించి అందర్నీ షాక్ కి గురిచేసింది. అయితే సోషల్ మీడియాలో ఈ పదాన్ని ఏదైనా కష్టంగా ఉన్న అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి లేదా జోక్ చెప్పేటప్పుడు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఇక అనసూయ చెప్పిన మాటలు వింటుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న గుట్టు రట్టు చేయాలనే చూస్తోంది అని ఆమె పోస్ట్ చేసిన చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు.