ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ విషయంపై క్లారిటీ?

praveen
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా 2025 ఐపీఎల్ సీజన్ గురించి చర్చ జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభానికి ముందే మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది. దీంతో ఈ మెగా వేలంలో ఇక ప్రతి ఫ్రాంచైజీ కూడా జట్టు లో ఉన్న అందరూ ఆటగాళ్లను వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం బీసీసీఐ నిర్ణయించిన మేరకు మాత్రమే కొంత మంది ప్లేయర్లను పరిమిత సంఖ్య లో రిటైన్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.

 అందుకే 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు జరగబోయే మెగా వేలంలో ఏ టీమ్ ఏ ఆటగాడిని జట్టు లోకి తీసుకోబోతుంది. ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోబోతుంది అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఇక ఇప్పటికే కొన్ని టీమ్స్ ఏకంగా తమ కెప్టెన్లను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా 2025 ఐపీఎల్ సీజన్ గురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 అయితే ఇక వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ లో ప్లేయర్ల రిటెన్షన్ ఇక క్లారిటీ వచ్చిందట. మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీ  ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వబోతుందట బీసీసీఐ. ఇక ఇలా రిటైన్ చేసుకునే ఐదుగురిలో ముగ్గురు భారత ప్లేయర్లు ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండాలనే రూల్ పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా అన్ని జట్ల యాజమాన్యాలకు కూడా రైట్ టు మ్యాచ్ అనే ఆప్షన్ కూడా అందుబాటులో ఉందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా మెగా వేలం డేట్ కోసం కూడా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: