రేణూ దేశాయ్: తప్పని తిప్పలు..మరి ఇంత దారుణమా.. వీడియో వైరల్..!
గత కొన్నేళ్లుగా తన వ్యక్తిగత జీవితం పైన, రాజకీయ అభిప్రాయాల పైన కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని. ముఖం చూపించే ధైర్యం లేక చాలామంది ఫేక్ అకౌంట్లతో ఇలా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారని తెలియజేసింది. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం ఏం సంస్కారం? మీ ఇంట్లో కూడా మీ అక్క చెల్లెలు ఉంటారు ఒకసారి మీ మనసాక్షిని అడిగి చూడండి ఎటువంటి కామెంట్స్ పెడుతున్నారో చూడండి. పిచ్చికుక్కలు రేణూ దేశాయ్ కరిస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని చాలా అసభ్యకరమైన పదాలను వాడారు.
మొన్న కులాల మధ్య గొడవలో కూడా ఒక బిడ్డ ప్రాణం పోతే తననే తిడుతున్నారని అసలు తన ప్రమేయం లేకుండానే తాను ఇలాంటివన్నీ ఎందుకు భరించాలి నేను కాశీకి వెళ్ళినప్పుడు కూడా చాలానే విమర్శలు చేశారు. నిండుగా ధరించిన దుస్తులు వేసుకొని ఫోటోలను షేర్ చేస్తే రాత్రికి రేటెంత? అంటూ చాలా అసభ్యకరంగా కామెంట్స్ తో అడిగారని.. నన్ను తిడితే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నేను నా కుటుంబంతో కలిసి పబ్లిక్ ముందు వచ్చి కూర్చుంటాను అందర్నీ బండ బూతులు తిట్టండి దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఒక ప్రాణం నిలబడుతుందా చెప్పండి , మీరు ఎంచుకున్న ఎమ్మెల్యేలను బూతులు తిట్టండి మీకు దమ్ముంటే అంటూ ఫైర్ అయ్యింది రేణూ దేశాయ్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.