అశ్విన్ ఆ దేశానికి ఆడుంటే.. దారుణంగా బలయ్యేవాడా?

praveen
నేటి తరంలో వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు అంటే భారత జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ పేరు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అతన్ని తెలివైన బౌలర్ అని..క్రికెట్ రూల్స్ ని అవపోసన పట్టిన స్పిన్ మాంత్రికుడు అని ఇక ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ ఆటగాడికి ఎక్కడ బంతులు వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు.

 అందుకే అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు అంటే పరుగులు చేయడం కాదు ఏకంగా వికెట్ కాపాడుకోవడానికి ప్రత్యర్థి బ్యాటర్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అందరూ ప్లేయర్లకు ఐదు వికెట్ల హాల్ సాధించడం చాలా కష్టం. కానీ అశ్విన్ మాత్రం ఎంతో అలవోకగా ఇది సాధించేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల చపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండో ఇన్నింగ్స్ లో కూడా అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు. తన స్పిన్ మ్యాజిక్ తో బంగ్లాదేశ్ ను వనికించేశాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ఫార్మాట్లో ఐదు వికెట్లు తీసిన అతిపెద్ద వయసుకుడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ అశ్విన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
 ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడి ఉంటే ఎప్పుడో బలయ్యేవాడు. ఆటకు వీడ్కోలు పలికే వాడు అంటూ మాంటి పనేసర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అశ్విన్ ఇంగ్లాండ్ తరఫున ఆడి ఉంటే ఇప్పటికే అతనికి వీడ్కోలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. క్రికెట్ బోర్డు కూడా ఇదే కోరేది. ఎందుకంటే ఇంగ్లాండ్ సెలెక్టర్లు ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతిభ గల యువ క్రికెటర్లను ఆడించేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటూ మాంటి పనేసర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: