RCBలోకి టెండూల్కర్‌..కోట్లు పెట్టి మరీ?

frame RCBలోకి టెండూల్కర్‌..కోట్లు పెట్టి మరీ?

Veldandi Saikiran
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం మెగా వేలం ఈ సంవత్సరం నవంబర్ చివరన లేదా డిసెంబర్ నెలలో ప్రారంభం అవుతుందని బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. ఇందుకు సంబంధించిన కొన్ని నియమ నిబంధనలను బీసీసీఐ రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలియజేశారు. గత పదేళ్లలో రెండుసార్లు ఐపీఎల్ అతిపెద్ద వేలం పాటలను నిర్వహించింది. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో నిర్వహించింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ సస్పెన్షన్ తర్వాత తిరిగి ఐపీఎల్ లోకి రావడం జరిగింది.

2025 ఐపీఎల్ కు సంబంధించి మెగా వేళానికి మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటూ బోర్డు వర్గాలు తెలియజేశాయి. ఈ తరుణంలోనే మెగా వేలంలో ఆర్సిబి భారత్ కు చెందిన ఫేస్ ఆల్ రౌండర్ లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికోసం కొంతమంది ఆటగాళ్లను టార్గెట్ కూడా చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో ఆంధ్ర క్రికెటర్ సన్రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి తో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఉన్నట్లుగా సమాచారం. నితీష్ దక్కకపోతే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఆర్సిబి తీసుకోబోతుందని సమాచారం.

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో అర్జున్ బంతితో అసాధారణ ప్రదర్శనను కనబరిచాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ ఆతిధ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లోనే ఐదు వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్ తో ఈ మ్యాచ్ లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తుచిత్తు చేసింది. ఈ ప్రదర్శనతో అర్జున్ టెండూల్కర్ తన సత్తాను చాటుకున్నాడు. అర్జున్ టెండూల్కర్ కు సరైన అవకాశాలు ఇస్తే మంచి ఆల్ రౌండర్ అవుతాడని ఆర్సిబి భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: