బాబర్ కు బిగ్ షాక్.. కెప్టెన్సీ గాన్.. పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఇక మొన్నటికి మొన్న ఏకంగా సొంత దేశంలోనే బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది అని చెప్పాలి. దీంతో పాకిస్తాన్ ఆట తీరు చూసి సొంత దేశ అభిమానుల సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాగే కొనసాగితే పాకిస్థాన్లో క్రికెట్ అనేది కనుమరుగు అవ్వడం ఖాయం అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టు కెప్టెన్ల విషయంలో గందరగోళం నెలకొంది. తరచూ ఇలా కెప్టెన్లు మారుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాక్ జట్టుకి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బాబర్ చేతికి కెప్టెన్సీ అప్పగించారు.
ప్రస్తుతం టెస్టులకి షాన్ మసూద్ కెప్టెన్ గా కొనసాగుతుండగా.. t20 వన్డేలకు కెప్టెన్సీ వహిస్తున్నాడు బాబర్. విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో షాకింగ్ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. బాబర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అనుకుంటుందట. అతని స్థానంలో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాను నియమిస్తారని క్రీడా వర్గాల నుంచి సమాచారం. నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ నుంచి ఈ మార్పులు జరిగే ఛాన్స్ ఉందట. రిజ్వాన్ ఓకే చెబితే టెస్ట్ కెప్టెన్సీ కూడా అతడికి ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఏం జరగబోతుందో చూడాలి మరి.