రోహిత్ శర్మ బ్యాటింగ్ పై.. అంపైర్ అనిల్ కీలక వ్యాఖ్యలు?

praveen
టీమిడియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిగా భారత జట్టులోకి వచ్చినప్పటికీ తన ఆట తీరుతో తక్కువ సమయంలోనే వరల్డ్ లోనే అత్యుత్తమ ప్లేయర్గా ఎదిగాడు. ఒకప్పుడు ఆల్రౌండర్ గా టీమిండియాలోకి వచ్చిన రోహిత్ శర్మ ఆ తర్వాత కాలంలో మాత్రం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అవతారం ఎత్తాడు. కెరియర్ మొదట్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చూసిన రోహిత్ శర్మ.. ఇక ఆ తర్వాత ఓపెనర్ గా మారాడు. ఓపెనర్ గా మారిన తర్వాత రోహిత్ కెరియర్ కు తిరుగులేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే.

 ఎంతో అలవోకగా డబుల్ సెంచరీలు చేయడంలో.. అంతేకాదు బంతిని బలంగా బాధి స్టేడియం దాటించడంతో రోహిత్ శర్మ దిట్టా అని చెప్పాలి. అందుకే ఆయనను అభిమానులందరూ కూడా డబుల్ సెంచరీల వీరుడు, సిక్సర్ల దీరుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ మొన్నటికి మొన్న జరిగిన టి20 వరల్డ్ కప్ లోభారత జట్టును విశ్వవిజేతగా నిలపాడు. అయితే రోహిత్ శర్మ ఎంతో భయంకరమైన బ్యాట్స్మెన్. అందుకే అతనికి బౌలింగ్ చేయాలంటే బౌలర్లు భయపడిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎంతో మంది స్టార్ బౌలర్లు పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పారు అన్న విషయం తెలిసిందే.

 అయితే రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ వికెట్ల వద్ద ఉండి అంపైరింగ్ చేస్తున్న వారికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అన్న విషయాన్ని ఇటీవల ఎంపైర్  అనిల్ చౌదరి చెప్పుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ ప్లేయర్ అంటూ ప్రశంసించాడు. శ్రీలంక పై రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయడం తాను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఆడుతున్నప్పుడు 160 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి కూడా 120 కిలోమీటర్ల అనిపిస్తుంది. యార్కర్లను  సిక్సర్లుగా మలుస్తాడు. ఆయన వన్ మాన్ ఆర్మీ. రోహిత్ చూడటానికి లేజీగా అనిపించిన.. ఆయన ఆలోచనలు అద్భుతం, ఇక ఆయన బ్యాటింగ్ షైలి నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: