ఈత కొట్టాలంటే చేతులు కావాలా.. లేకుండానే అతను స్వర్ణం సాధించాడు?
ప్రస్తుతం పారిస్ పారా ఒలంపిక్స్ జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే పారాలింపిక్స్ లో పాల్గొనే వారంతా కూడా వివిధ రకాల వైకల్యాలతో ఇబ్బంది పడేవారే. ఇక నిబంధనలకు అనుగుణంగా దాదాపు ఇలా వైకల్యం కలిగిన వారు పోటీ పడటం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది పోరాటం చూస్తే మాత్రం కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అలాంటి జాబితాలోకి వస్తాడు అథ్లెట్ గాబ్రియల్ దాస్ శాంతూస్ ఆరోజ్. ఇతనికి అసలు చేతులే లేవు. అయితే ఇతను పాల్గొన్న పోటీ ఏంటో తెలుసా.. స్విమ్మింగ్.
అదేంటి చేతులు లేకుండా స్విమ్మింగ్ ఎలా చేస్తాడు అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఏకంగా డాల్ఫిన్ తరహాలో అతను స్విమ్మింగ్ పోటీలలో ఈది ఏకంగా బంగారు పథకాన్ని సాధించాడు. బ్రెజిల్ కు చెందిన ఈ స్విమ్మిర్ కొలనులో దూసుకుపోతున్న తీరు చూస్తే వైకల్యం కూడా అతని ముందు తలవంచి అభివాదం చేసింది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. పుట్టుకతోనే పోకో మెలియా అనే వ్యాధి బారిన పడటంతో.. గాబ్రియల్ రెండు చేతులు పూర్తిగా కోల్పోయాడు. కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి. ఇలాంటి స్థితిలో అతను స్విమ్మింగ్ పై ఆసక్తి చూపించి కొలనులోకి దిగాడు. శరీరాన్ని మాత్రమే కదిలిస్తూ డాల్ఫిన్ తరహాలో ఈత నేర్చుకొని ఇక ఇదే టెక్నిక్ తో పారాలింపిక్స్ లో స్విమ్మర్గా బరిలోకి దిగి చివరికి ఈ 22 ఏళ్ల అథ్లెట్ బ్రెజిల్ కి బంగారు పథకాన్ని అందించాడు. 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో దూసుకుపోయిన అతను ఒక నిమిషం 53.67 సెకండ్ల లోనే దీని ముగించి గోల్డ్ గెలుచుకున్నాడు. గతంలో టోక్యో ఒలంపిక్స్ లో కూడా రెండు స్వర్ణాలు ఒక రజతం గెలిచి అదరగొట్టాడు ఇతగాడు.