మ్యాచ్ పోయినా.. రోహిత్ అరుదైనా రికార్డ్ కొట్టాడుగా?
మొదటి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితుల్లో కూడా టీమిండియా మ్యాచ్ టైగా ముగించింది. ఇక ఆ తర్వాత రెండు మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది భారత జట్టు. దీంతో శ్రీలంక జట్టు సిరీస్ ను కైవసం చేసుకోగలిగింది అని చెప్పాలి. అయితే భారత జట్టు ఏకంగా మూడో వన్డే మ్యాచ్లో భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూడటం అటు అభిమానులు అందరిని కూడా షాక్ కు గురిచేసింది అని చెప్పాలి. దాదాపు 27 ఏళ్ల తర్వాత భారత జట్టు ఇలా శ్రీలంక జట్టుపై వన్డే సిరీస్ ఓడిపోవడంతో ఈ ఓటమిని అటు భారత జట్టు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా భారత జట్టు ఓడిపోయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
20 బంతుల్లోనే ఏకంగా 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 175 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజ్ లో ఉన్నంత సేపు లంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. వరుస ఫోర్ లతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ఒక అరుదైన రికార్డును నమోదు చేశాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో సిక్సర్ల విషయంలో రెండో స్థానంలో నిలిచాడు లంకతో మ్యాచ్ లో కొట్టిన సిక్స్ వన్డేల్లో రోహిత్ కు 331 సిక్సర్ కావడం గమనార్హం. దీంతో అత్యధిక సిక్సర్ల విషయంలో విండిస్ లెజెండ్ క్రిస్ గేల్ 31 సిక్సర్ల రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ. ఈ లిస్టులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.