నా మొఖం ఏం చూస్తున్నావ్.. నువ్వే చెప్పాలి.. రోహిత్ వార్నింగ్?

praveen
ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది   ఇక ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు ఫార్మట్లలో సిరీస్ లు ఆడుతుంది   ఇప్పటికే t20 సిరీస్ ను విజయవంతంగా ముగించుకొని సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇక ఇప్పుడు వన్డే సిరీస్ లో బరిలోకి దిగింది. దాదాపు నెలరోజుల విశ్రాంతి తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ జట్టులోకి పునరాగమనం చేశాడు అని చెప్పాలి. కాగా ఇటీవలే మొదటి వన్డే మ్యాచ్ జరగకుండా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ చివరికి టై గా ముగిసింది అన్న విషయం తెలిసిందే.

 చివరి బంతి వరకు కూడా టీమిండియా గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ చివరికి దురదృష్టం వెంటాడటంతో భారత జట్టు పైగానే మ్యాచ్ ను ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో.  ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తూ ఉండగా.. ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అటు వాషింగ్టన్ సుందర్ ఎల్బిడబ్ల్యు అప్పిల్ చేయగా అంపైర్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. దీంతో ఏం చేయమంటావు అంటూ అటు వికెట్ల పక్కన ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మను వాషింగ్టన్ సుందర్ చూశాడు. దీంతో నా మొహం చూస్తున్నవేంటి చెప్పాల్సింది.. నువ్వు చెప్పాల్సింది అంటూ రోహిత్ శర్మ అన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 మ్యాచ్ జరుగుతుండగా 29వ ఓవర్ వేశాడు వాషింగ్టన్ సుందర్. ఈ క్రమంలోనే ఐదవ బంతికి బ్యాటర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి అటు ప్యాడ్ కి తాకింది. దీంతో ఎల్పిడబ్ల్యు కోసం అప్పీల్ చేశాడు వాషింగ్టన్ సుందర్. అయితే ఎంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూశాడు. ఏమంటావ్ రోహిత్ అన్న అన్నట్లుగా  గైడెన్స్ కావాలని సైగ చేశాడు. ఇందుకు బదులుగా రోహిత్ శర్మ ఏంటి నువ్వే చెప్పాలి కదా.. నా మొహం ఏం చూస్తున్నాం. నాకేం కనిపిస్తుంది అని నన్ను అడుగుతున్నావ్. నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా అంటూ సరదాగా కసురుకున్నాడు. దీంతో ఇదంతా స్టంట్ మైక్ లో రికార్డు అయింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: