ఎవరి స్టైల్‌లో వారిని ఆడనిస్తేనే మంచిది.. గంగూలీ నేర్చుకున్న పాఠం ఇదేనట?

praveen

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇటీవల 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌ను గుర్తుచేసుకున్నాడు. పాపులర్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆతిథ్య జట్టుపై భారత జట్టు 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని గెలుచుకుంది. లార్డ్స్ బాల్కనీలో ఉత్సాహంగా తన చొక్కా విప్పి గంగూలీ ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
గంగూలీ తన మాజీ కోప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ నుంచి నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠాన్ని పంచుకున్నారు. అది కెప్టెన్సీకి సంబంధించినది. ఆ మ్యాచ్ లో గంగూలీ (60 పరుగులు), సెహ్వాగ్ (45 పరుగులు) ఓపెనర్లుగా బ్యాటింగ్ చేస్తూ 15 ఓవర్లలో 106 పరుగులు చేసి భారతదేశానికి బలమైన పునాది వేశారు. కానీ వారు త్వరగా వెళ్లిపోవడంతో పాటు మరో మూడు వికెట్లు పడటంతో భారత్ 146/5 స్కోరుతో కష్టాల్లో పడింది.
అయితే, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్‌ల అద్భుతమైన ఆటతో భారత్ గెలుపు సాధించింది. గంగూలీ ఈ మ్యాచ్‌లో ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఆటగాళ్ల సహజ ప్రతిభను నమ్మడం ఎంత ముఖ్యమో నేర్చుకున్నానని చెప్పాడు. మంచి ప్రారంభం తర్వాత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్‌కు సలహా ఇచ్చినప్పటికీ, సెహ్వాగ్ తన సొంత శైలిలో ఆడుతూనే ఉన్నారని, తన సలహాను పాటించలేదని గంగూలీ వివరించాడు.
"12 ఓవర్లలో 82 పరుగులు చేశాం. కొత్త బాల్ బౌలర్లు వచ్చాక సింగిల్స్‌పై దృష్టి పెట్టాలని సూచించా. కానీ సెహ్వాగ్‌ మాత్రం అలా ఆడుతూనే ఉన్నాడు." అని గంగూలీ తెలిపారు. "కానీ, రోనాల్డ్ చార్లెస్ ఇరానీ తన మొదటి ఓవర్ వేసినప్పుడు, సెహ్వాగ్ మొదటి నాలుగు బంతులకు బౌండరీలు కొట్టాడు. ఒక బౌండరీ తర్వాత మనం సింగిల్స్ ఆడాలని నేను అతనికి సలహా ఇచ్చాను, కానీ నా మాట వినకుండా అతను మళ్లీ బౌండరీలు కొట్టడం కొనసాగించాడు. నేను చాలా కోపంగా ఉన్నా. చివరికి, అతని సహజ ఆట పీక్ స్టేజ్‌లో ఉండటం వల్ల అతన్ని ఆపడానికి ప్రయత్నించడం వృథా అని నాకు అర్థమైంది," అని గంగూలీ అన్నారు. ఆటగాళ్లను వారి సొంత ఆటలోనే ఆడమని కెప్టెన్ గా ప్రోత్సహించాలి అప్పుడే మ్యాచులు కలగా గెలవగలం అని గంగూలీ తాను నేర్చుకున్న పాఠం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: