మరోసారి తెరమీదికి.. హార్దిక్ విడాకుల అంశం?

praveen
గత కొంత కొంతకాలం నుండి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచి హార్దిక్ పాండ్యా గురించి ఏదో ఒక వార్త తెరమీదకి వస్తూ వైరల్ గా మారిపోతూనే ఉంది. ఈ ఐపిఎల్ సీజన్ ముందు వరకు గుజరాత్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా మళ్లీ తన పాత టీం అయినా ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు. ఇలా రావడమే కాదు ఏకంగా కెప్టెన్సీ కూడా చేపట్టాడు. హార్దిక్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మను సైతం పక్కన పెట్టింది.

 దీంతో ఈ విషయాన్ని రోహిత్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఐపీఎల్ జరిగినన్ని రోజులు అటు హార్దిక్ పాండ్యా పై విమర్శలు చేస్తూనే వచ్చారు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాను వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఆ తర్వాత హార్దిక్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏకంగా హార్దిక్ భార్య నటాషా భర్త హార్దిక్ పాండ్యాతో దిగిన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ చర్చ మొదలైంది. కానీ తాము కలిసే ఉన్నాము అంటూ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు.

 ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చూసి భారత జట్టుకు కప్పు అందించడంలో కీలకపాత్ర వహించిన హార్దిక్ పాండ్యా మరోసారి వార్తలలో నిలిచాడు. ఇకపోతే ఇప్పుడు మరోసారి అటు హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం తెరమీదకి వచ్చింది. అంబానీ ఇంట జరుగుతున్న ఆనంద్ - రాధిక సంగీత్ వేడుకకు హార్దిక్ సింగిల్ గా హాజరయ్యాడు. అంతకుముందు వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ లోనూ భార్య నటాషా లేకుండా కేవలం కొడుకు అగస్త్యతో మాత్రమే కనిపించాడు హార్థిక్. దీంతో హార్దిక్ దంపతులు విడిపోతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: