కప్పు గెలిచిన ఇండియా.. ఆస్ట్రేలియా మీడియా కడుపు మంట?

praveen
ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా గత కొంతకాలం నుంచి ప్రపంచ కప్ టోర్నీలో మంచి ప్రదర్శన చేస్తూ వస్తుంది. ఇలా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కప్పు గెలవాలి అనే కళ మాత్రం టీమ్ ఇండియాకు సహకారం అవడం లేదు అన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఇక మంచి ప్రదర్శన చేస్తూ సెమీఫైనల్ ఫైనల్ వరకు దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. ఇక కీలకమైన మ్యాచులలో మాత్రం తడబడుతూ చివరికి టైటిల్ను చేజార్చుకుంటుంది.

 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఫైనల్ వరకు పరాజయమే లేకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా  జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో మాత్రం టీమిండియా అదరగొట్టేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కు వెళ్లడమే కాదు.. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ఓడించి వరల్డ్ కప్ టైటిల్ కలను సహకారం చేసుకుంది. విశ్వవిజేతగా అవతరించింది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ అరుదైన రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి.

 అయితే ఇలా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి వరల్డ్ కప్ను సొంతం చేసుకోగా.. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాని ఓడించి ఇంటికి పంపించగలిగింది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే భారత్ కప్పు గెలవడంతో ఆస్ట్రేలియా మీడియా కడుపు మంటను చూపిస్తోంది. ఏకంగా వరల్డ్ కప్ ను భారత్ సొంతం చేసుకోవడంపై ఆస్ట్రేలియా మినహా అన్ని దేశాలు రోహిత్ సేన పై ప్రశంసలు కురిపించాయి. టీమిండియా కు t20 వరల్డ్ కప్ లో అన్ని అనుకూలించాయ్. దక్షిణాఫ్రికా కుప్పకూలడం, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు కప్పు గెలిచింది అన్నట్లుగా ఇటీవలే ఆస్ట్రేలియా మీడియా అయిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ రాసుకోచ్చింది. సూపర్ 8 లో ఆస్ట్రేలియా పై భారత్ గెలిచి ఇంటికి పంపించడం జీర్ణించుకోలేక.. ఇక భారత్ కప్పు గెలవడానికి పై ఇలా ఆస్ట్రేలియా మీడియా కడుపు మంటతో ఉందని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: