పాక్ అసలు జట్టే కాదు.. హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్,  యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది అని ఆ జట్టు అభిమానులు అందరూ కూడా ఎంతలా అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ అందరి అంచనాలు కూడా తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే మంచి ప్రదర్శనతో టైటిల్ పోరులో అన్ని టీమ్స్ కంటే ముందు ఉంటుంది అనుకున్నా పాకిస్తాన్ వెనుకబడిపోయింది. ఎంతలా అంటే కనీసం సూపర్ 8 కి కూడా అర్హత సాధించకుండా.. వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించేంత వెనుకబడిపోయింది పాకిస్తాన్.

 వరుస ఓటములతో సతమతమై ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఆ జట్టు ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత ప్రదర్శన చూసుకుంటున్నారు తప్ప.. జట్టు విజయం కోసం ఏ ఒక్క ఆటగాడు పాటుపడటం లేదు అంటూ ఆ దేశం ఆజీ ఆటగాళ్ళు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక పాకిస్తాన్ జట్టు ఆట తీరుపై ఏకంగా ఆ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న గ్యారీ కిర్ స్టన్ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి.

 పాకిస్తాన్ జట్టులో అసలు ఐక్యత లేదు అంటూ ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారి కిర్ స్టేన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు  అంతా విడిపోయారు. దీన్ని ఎవరు జట్టు అనరు  నేను చాలా జట్లతో పని చేశాను. కానీ ఇలాంటి పరిస్థితిని నేను ఎక్కడా చూడలేదు అంటూ గ్యారి కిర్ స్టన్  చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి అని చెప్పాలి. పాలిటిక్స్ తో నిండిన పాకిస్తాన్ ను విజేతగా నిలిపేందుకు కిర్ స్టెన్ ఏమీ మాంత్రికుడు కాదు అంటూ ఆ దేశం మాజీ ఆటగాడు  కనేరియా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక దీని బట్టి చూస్తే ప్రస్తుతం అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న పాకిస్తాన్ రానున్న రోజుల్లో ప్రపంచ క్రికెట్లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: