T20 WC లో సంచలనం.. ఏంటి బ్రో ఇది నిజమేనా?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల  విద్వాంసానికి మారుపేరుగా చెప్పుకుంటూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే ఒత్తిడి ప్రతి ఆటగాడి పై ఉంటుంది. అందుకే బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగిన ప్రతి ఆటగాడు కూడా.. ఇక మొదటి బంతినుంచే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవాలని మైండ్ సెట్ తో ఉంటారు  ఇక అలాంటి వారిని కంట్రోల్ చేసి పరుగులను కట్టడి చేయడం అనేది బౌలర్లకు పెద్ద సవాలుతో  కూడుకున్న పని అని చెప్పాలి.

 అయితే ఎవరైనా ఆటగాడి బౌలింగ్లో సిక్సర్లు రాలేదు అంటే కనీసం స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీయడానికైనా ప్రయత్నిస్తూ ఉంటారు ఆటగాళ్లు. కానీ టి20 ఫార్మాట్లో అటు ఓవర్లు మెయిడెడ్  అవడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇక ప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న t20 వరల్డ్ కప్ లో మాత్రం ఒక అరుదైన ఘటన జరిగింది. ఒక మ్యాచ్ లో ఒక్క ఓవర్ మేయిడిన్ అవ్వడమే చాలా అరుదు అనుకుంటే.. ఒక బౌలర్ తాను వేసిన నాలుగు ఓవర్లను మేయిడ్ ఇన్ చేశాడు. దీంతో అతని ప్రతిభకు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఆ ఆటగాడు ఎవరూ కాదు న్యూజిలాండ్ ఫేసర్ ఫెర్గ్యూసన్.అతని ప్రతిభకు ప్రపంచమే ఆశ్చర్యంలో మునిగిపోయింది.

 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రపంచ క్రికెట్లో పెను సంచలనమే నమోదు చేశాడు ఈ ఆటగాడు. ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా పుపవా న్యూ గనియాతో జరుగుతున్న మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఈ బౌలర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఏకంగా నాలుగు కి నాలుగు ఓవర్లు మెయిడ్ ఇన్ వేశాడు. అయితే అతని గణాంకాలు చూసి ఎంతోమంది మాజీ ప్లేయర్లు సైతం షాక్ లో మునిగిపోతున్నారు. కాగా అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఇక ఇవే అత్యుత్తమ గణాంకాలుగా మారిపోయాయి అని చెప్పాలి. కాగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీలో అటు పాకిస్తాన్ జట్టు లీగ్ దశతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే పూపువా  న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో గెలిచినప్పటికీ అది న్యూజిలాండ్ కు కేవలం ఓదార్పు గెలుపుగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: