T20 వరల్డ్ కప్ లో.. అది బిగ్ రిలీఫ్ అంటున్న రోహిత్?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమ్ ఇండియా గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడంతో ఎంతల వెనుకబడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో  టీమిండియా తప్పకుండా ప్రపంచం గెలుస్తుందని విశ్వ విజేతగా నిలుస్తుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే మొదటి మ్యాచ్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోయింది. ఇక ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

 అయితే ఇలా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి కేవలం రన్నరప్ తో సరిపెట్టుకున్నప్పటికీ ఇక వరల్డ్ కప్ మొత్తం వీరోచితమైన పోరాటం చేసి ప్రేక్షకుల  మనసులు గెలిచిన ఛాంపియంగా నిలిచింది. అయితే ఇక ఇప్పుడు యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ముద్దాడాలని పట్టుదలతో ఉంది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. కాగా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది భారత జట్టు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 కి అర్హత సాధించింది అన్న విషయం తెలిసిందే.

 ఇదే విషయం గురించి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో సూపర్ 8 కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అంటూ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. న్యూయార్క్ పిచ్ పై ఆడటం తేలికేమి కాదు. ఇలాంటి పిచ్ పైన 110 ప్లస్ స్కోర్ అయినా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉంది. మూడో మ్యాచ్లో సూర్య దూబే రాణించడంతో మ్యాచ్ గెలవగలిగాము. అయితే లీగ్ దశలో మూడు మ్యాచ్ లలో మూడింటిలో కూడా గెలిచాము. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్ 8 లో కూడా ఆడతాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: