T20 WC : ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన టీమ్ ఇండియా?

praveen
గత కొన్ని నెలల నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో టీమిండియా వెనకబడిపోతుంది అన్న విషయం అందరికీ తెలుసు. ఏకంగా లీగ్ దశలో అద్భుతంగా రాణించి నాకౌట్ మ్యాచ్ లలో కూడా అదరగొట్టి ఫైనల్ వరకు దూసుకు వెళ్తున్న టీమ్ ఇండియా చివరి అడుగులో మాత్రం బోల్తాపడుతుంది. కొన్ని కొన్ని సార్లు సెమీఫైనల్ లో కూడా వెనుతిరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియా ఫైనల్ కు వెళ్లిన ప్రతిసారి కూడా ఆ జట్టును ఓడించి విశ్వవిజేతగా నిలుస్తున్న టీం ఆస్ట్రేలియా.

 గత ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా అటు టీమిండియాని ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. అయితే ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే రీతిలో టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చింది ఆసిస్ జట్టు. ఎందుకంటే అప్పటివరకు ఓటమిలేకుండా ఫైనల్ వరకు దూసుకు వచ్చిన టీమిండియాను.. ఫైనల్ లో ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ ఎగరేసుకుపోయింది. గత ఏడాది రెండు ఐసిసి టోర్నమెంట్లలో భారత్ ను ఫైనల్ లో ఓడించిన ఆస్ట్రేలియాపై ఇక ఇప్పుడు వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో ప్రతీకరం తీర్చుకునేందుకు భారత జట్టుకు అవకాశం వచ్చింది.

 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల యూఎస్ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా సూపర్ 8 కి దూసుకు వెళ్ళింది. కాగా సూపర్ 8 లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జూన్ 24వ తేదీన తలబడేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. అయితే మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఇప్పటికే సూపర్ 8కు చేరుకుంది అని చెప్పాలి. గ్రూప్ సి లోని ఆఫ్ఘనిస్తాన్ లేదా వెస్టిండీస్, 22వ తేదీన గ్రూప్ డి లోని బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లతో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: