ప్చ్.. ఈ దిగ్గజ జట్లకు అసలేమైంది?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ టోర్నీ ఇటీవల ప్రారంభమైంది. వెస్టిండీస్,యూఎస్ లు ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్ కప్ టోర్ని జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాగా.. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు ఎంటర్టైర్మెంట్ పంచుతూ ఉంది అని చెప్పాలి. అయితే సాధారణంగా ఇలా వరల్డ్ కప్ టోర్ని జరిగిన ప్రతిసారి కూడా వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో కొనసాగుతున్న జట్లు అద్భుతంగా రానిస్తాయని నిపుణులు అందరూ కూడా అంచనా వేస్తూ ఉంటారు.

 ఇలా అగ్రశ్రేణి టీమ్స్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని.. ఇక వాటిలో ఏదో ఒక జట్టు విశ్వ విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకు పోతుంది అని అంచనా వేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024లో  మాత్రం అందరి అంచనాలు తారుమారు అవుతున్నాయి  ఎందుకంటే పెద్ద జట్లు చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తుంటే చిన్న టీమ్స్ మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ.. ఇక పాయింట్స్ టేబుల్ లో దూసుకుపోతున్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి చేరాయ్.

 ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఈ నాలుగు జట్లు ఇక తర్వాత మ్యాచ్ లలో గెలిచిన కూడా సూపర్ 8 కి అర్హత సాధించలేవు. ఒకవేళ ఈ టీమ్స్ సూపర్ 8 కి వెళ్లాలంటే మిగతా టీమ్స్ గెలుపు ఓటమిలపై భవితవ్యం ఆధారపడి ఉంది అని చెప్పాలి. ఇలా పెద్ద టీమ్స్ చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తుంటే.. మరోవైపు స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ఏ, బంగ్లాదేశ్ లాంటి చిన్న టీమ్స్ మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాయి. దీంతో ఈ వరల్డ్ కప్ పోరు మరింత రసవతరంగా మారిపోయింది. ఏ మ్యాచ్ లో ఏ పెద్ద జట్టుకు షాక్ తగులుతుందో అన్న విధంగానే మారిపోయింది పరిస్థితి. దీంతో   ఒక మ్యాచ్ కూడా మిస్ చేయకుండా క్రికెట్ ప్రేక్షకులు చూసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: